ఎలక్ట్రిక్ కెటిల్ వాడుతున్నారా..? అయితే ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

ఎలక్ట్రిక్ కెటిల్ వాడుతున్నారా..? అయితే ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయకండి..!

by Anudeep

Ads

ఇటీవల కాలంలో చాలా మంది నీటిని వేడి చేసుకోవడం కోసం కెటిల్ ను ఉపయోగిస్తున్నారు. పాస్తా, నూడుల్స్, గుడ్లు ఉడకపెట్టడం వంటి వాటికి కూడా దీనిని వాడేస్తున్నారు. అయితే, వాడుకోవడం సులువుగా ఉండడంతో కొన్ని ఇతర పదార్ధాల కోసం కూడా దీనిని వాడేస్తున్నారు. ఇటువంటి పొరపాట్లు చేయడం వలన ఈ కెటిల్స్ తొందరగా పాడైపోతూ ఉంటాయి.

Video Advertisement

 

అయితే.. ఎంత నాణ్యమైన కెటిల్స్ అయినా ఒక్కోసారి పాడైపోతూ ఉంటాయి. మీ కెటిల్స్ పాడవకుండా ఉండాలంటే వాటిని ఉపయోగించే తప్పుడు ఈ 5 తప్పులను అస్సలు చేయకండి. అవేంటో ఓ లుక్ వేయండి.

kettle 1

#1. ఎలక్ట్రిక్ కెటిల్స్ లో నిర్ణీత మోతాదుకు సరిపడా పదార్ధాలను మాత్రమే ఉంచాలి. ఎక్కువ మొత్తంలో నీటిని పోయకూడదు. దీనివల్ల నీరు బాయిల్ అయ్యేటపుడు అవుట్ లెట్ రంద్రాల నుంచి బయటకు వెళ్లి కెటిల్ మెషిన్ లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. అప్పుడు మెషిన్ పాడవుతుంది. అలా అని తక్కువ మొత్తంలో నీరు పోయడం, అసలు నీరు లేకుండా వాడడం కూడా సరికాదు.

kettle 2

#2. కొంతమంది కెటిల్ ని వాడిన తరువాత ఆ నీటిని అందులోనే ఉంచేస్తూ ఉంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. దానివల్ల కెటిల్ లోపల తెల్లటి పొర పేరుకుపోతుంది. దీనివలన క్రమంగా కెటిల్ నాణ్యత తగ్గిపోతుంది. కెటిల్ ని వాడటం పూర్తయ్యాక ఆ నీటిని పూర్తిగా తీసేసి ఖాళీగా ఉంచడమే మంచిది.

kettle 3

#3. కెటిల్ లో నీరు మరుగుతున్నప్పుడు పొగలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ పొగల వలన తేమ కూడా ఏర్పడుతుంది. దగ్గరిలో ఏదైనా ఫర్నిచర్ ఉంటె అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే.. ఆ పొగలు స్విచ్ బోర్డు వైపు వెళ్లేలా ఉన్నా ప్రమాదమే. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి.

kettle 4

#4. కెటిల్ ని టాప్ కింద కడగకూడదు. సమపాళ్లలో నీటిని వెనిగర్ ను తీసుకుని కెటిల్ లో పోయాలి. కెటిల్ కు సగం వరకు ఈ మిశ్రమాన్ని ఉంచి స్విచ్ ఆన్ చేయాలి. కొంతసేపు మరిగించాక స్విచ్ ఆఫ్ చేసి అరగంట సేపు వదిలేయాలి. ఆ తరువాత స్క్రబ్బర్ తో రుద్ది కడిగేయాలి. బయట వైపు తడి గుడ్డ తో తుడుచుకుంటే సరిపోతుంది. కానీ, టాప్ కింద పెట్టి కడగడం వలన నీరు మెషిన్ రంధ్రాలలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

#5. కెటిల్ లో ఏయే పదార్ధాలు వాడుకోవచ్చనే విషయాన్నీ ప్యాకేజింగ్ లేబుల్ పై చెబుతారు. వాటి కోసం మాత్రమే కెటిల్ ను వినియోగించాలి. ఇతర పదార్ధాలను వండడం కోసం కూడా కెటిల్ ను వాడడం వలన దాని నాణ్యత తగ్గిపోతుంది.


End of Article

You may also like