మీ ఇంట్లో శివలింగం ఉందా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందులే..!

మీ ఇంట్లో శివలింగం ఉందా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందులే..!

by Anudeep

Ads

భక్త సులభుడైన భోళా శంకరుడికి భారత్ లో భక్తులకు కొదవలేదు. లింగ రూపంలో పూజలు అభిషేకాలు అందుకునే శివయ్యకు భారత్ లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు భక్తులే. శివుడు భక్త సులభుడు, అభిషేక ప్రియుడు అన్న సంగతి తెలిసిందే. ఒక చెంబుడు నీటిని పోసి.. మనస్ఫూర్తిగా నమస్కరిస్తే ఆయన కరుణించేస్తాడు.

Video Advertisement

అయితే శివుడికి అభిషేకం చేసేటప్పుడు చాలా మందికి పద్ధతులు తెలియక ఇష్టం వచ్చినట్లు అనుసరిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేయకుండా శాస్త్రం ప్రకారం అనుసరించడం మంచిది.

sivalingam

ఇంకా ఇంట్లో ఉండే శివలింగం బొటన వేలు కంటే ఎక్కువ ఎత్తు ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లో అనర్ధాలే. శివలింగానికి పసుపుని సమర్పించకండి. నిజానికి శివ లింగానికి నిత్యం గంధంతో అలంకరిస్తుంటారు. పసుపుని శివలింగం పై వేస్తుంటే శివుని ఆగ్రహానికి గురవుతారట. అలాగే శివలింగం బంగారం కానీ, వెండి కానీ, ఇత్తడి లేదా క్రిస్టల్ అయి ఉండాలట.

గాజు శివలింగాలను ఇంట్లో ఉంచకండి. అలాగే శివలింగాన్ని పూజించే సమయంలో తులసి ఆకులను ఎప్పటికీ సమర్పించవద్దు. శివుడికి బిల్వ పత్రాలు, మారేడు దళాలు అంటే ఇష్టం. అందుకే వీటినే సమర్పించండి. తెలియక పొరపాటున చేసినా.. ఇక నుంచి శివుడిని ఆరాధించేటప్పుడు భక్తి శ్రద్దలతో ఆరాధించండి.


End of Article

You may also like