ఆడవాళ్లు రాత్రి భోజనం చేసిన తరువాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు..! అవేంటంటే?

ఆడవాళ్లు రాత్రి భోజనం చేసిన తరువాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు..! అవేంటంటే?

by Anudeep

మనలో చాలా మంది భోజనం చేసాక కొన్ని పనులను తెలిసో..తెలియకో చేస్తూ ఉంటాం. అయితే.. ఈ పనులను ఇప్పటికైనా మానుకోవడం మంచిది. ఎందుకంటే.. తిన్న వెంటనే మన శరీరానికి మనం తిన్న ఆహార పదార్ధాలలోని పోషకాలని అందుకునే సమయం ఇవ్వాలి. ఆ సమయం ఇవ్వకుండా పనులు చేయడమో.. నిద్రపోవడమో చేయడం వలన మన శరీరం పోషకాలను గ్రహించలేదు.

Video Advertisement

ఎవరైనా సరే అన్నం తిన్నతరువాత కొంచం సేపు నడవడం ఉత్తమం. ముఖ్యంగా ఆడవాళ్లు భోజనం చేసిన తరువాత కొన్ని పనులను చేయకూడదు. తెలియకుండా కొన్ని పనులను చేయడం వలన ఇంట్లో సంపాదించిన ఆస్తులలో రూపాయి కూడా మిగలకుండా పోతుందట.

lunch

ఇంతకీ.. అన్నం తిన్న తరువాత ఆడవాళ్లు చెయ్యకూడని పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటుంటారు. అన్నం వృధా చేయడం అంటే ఆ పరబ్రహ్మని నిర్లక్ష్యం చేసినట్లే. అందుకే అన్నాన్ని గౌరవించాలని చెబుతుంటారు. అన్నం తినే సమయంలో దగ్గు వస్తే.. తిన్న చోటనే కూర్చుని ఉమ్మివేయడం లాంటివి చేయకూడదు. భోజనం చేసాక చాలా మంది నోటిలో పుల్లని గుచ్చుకుని తిప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా దారిద్ర హేతువే. నోటిలో నీరు పోసుకుని పుక్కిలించాలి.

lunch 1

పళ్లలో పుల్లలు గుచ్చడం సరికాదు. మరికొంతమంది ఆడవాళ్లు తిన్న తరువాత అలసి పోయి ఉండడం చేత.. తిన్న ప్లేట్ల పక్కనే నడుము వాలుస్తుంటారు. దీనివల్ల కూడా దారిద్య్రం సంభవిస్తుంది. ఇక, మరికొందరు చేతులు కడిగిన తరువాత ఆ నీటిని విదిలిస్తూ ఉంటారు. ఆ నీటి చుక్కలు చుట్టూ ఉండే వాటిపై పడే అవకాశం ఉంది. కాబట్టి చెయ్యి కడిగిన తరువాత నీటిని విదిలించకుండా ఏదైనా వస్త్రానికి తుడుచుకోవడం మంచిది.


You may also like