హాస్పిటల్ ఫారమ్స్ నింపేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..! లేదంటే ఇన్సూరెన్స్ క్లైములో ఇబ్బందులే..!

హాస్పిటల్ ఫారమ్స్ నింపేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..! లేదంటే ఇన్సూరెన్స్ క్లైములో ఇబ్బందులే..!

by Anudeep

ప్రస్తుతం ఉన్న రోజులలో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికీ ముఖ్యమైనది. ఎందుకంటే సమస్య చిన్నదే అయినా ఆసుపత్రుల బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మనలని ఆదుకునేది హెల్త్ ఇన్సూరెన్స్ ఒక్కటే. ఈ పరిస్థితులలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మనకు ముప్పుని తీసుకురావచ్చు.

Video Advertisement

అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు ఆ ఫారమ్స్ లో కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదు. దాని వలన ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంతకీ ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

health insurance 1

ఓ వ్యక్తి హఠాత్తుగా హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే చిన్న స్ట్రోక్ కావడంతో అతను రెండు రోజుల్లో కోలుకుని డిశ్చార్జ్ అయిపోయాడు. అయితే అతను ముందే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉన్నాడు. సదరు బీమా సంస్థ ఈ రెండు రోజులకు గాను అయిన 57 వేల రూపాయల ఇన్సూరెన్స్ ను క్లెయిమ్ చేయడానికి తిరస్కరించింది. ఫీవర్, ఫుడ్ పాయిజనింగ్ వంటి చిన్న చిన్న కారణాలకు కూడా ఆసుపత్రిలో చేరక్కర్లేదని భీమా సంస్థలు వాదిస్తుంటాయి. తక్కువ రోజులు ఆసుపత్రిలో ఉన్నప్పుడు, తగినంత అవసరం లేదని భీమా సంస్థలు భావించినప్పుడు ఇన్సూరెన్స్ ను అప్రూవ్ చేయకుండా రద్దు చేస్తాయి.

health insurance 2

మరోవైపు చికిత్సతో సంబంధం లేకుండా రోగి ఆసుపత్రిలో 24 గంటల పాటు ఉంటె ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయించాల్సి వస్తుందని ఆసుపత్రులు భావిస్తున్నాయి. కేవలం ఎండోస్కోపీని చేయించుకోవాల్సిన రోగులను కూడా ఒక్కోసారి 24 గంటలు అడ్మిట్ చేసుకుంటున్నాయి. అయితే భీమా సంస్థలు కేవలం వైద్య పరీక్షల కోసం ఇన్సూరెన్స్ ను చెల్లించవు. రోగి పరిస్థితి, నివేదికలు, ఇంకా ఇతర ఆరోగ్య సమస్యలని దృష్టిలో ఉంచుకుంటాయి.

health insurance 3

అలాగే భీమా సంస్థలు తమ చార్జీల విధానాలకు అంగీకారం తెలిపిన ఆసుపత్రులతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఈ ఆసుపత్రులలో ఇన్సూరెన్స్ సాయంతో నగదు రహిత చికిత్స సాధ్యం అవుతుంది. అయితే.. ఈ ఒప్పందాలు లేని ఆసుపత్రులలో చికిత్స చేయించుకుంటే.. ముందు అక్కడ బిల్లులను క్లియర్ చేసుకుని.. ఆ తరువాత ఇన్సూరెన్స్ సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

health insurance 4

ఇలాంటి తిరస్కరణలే కాకుండా.. కస్టమరీ, రీజనబుల్ ఛార్జీల నిబంధనల వల్ల కూడా ఒక్కోసారి ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ నిబంధనల ఉద్దేశ్యం ఏంటంటే.. ఆసుపత్రిలు విధిస్తున్న చార్జీలు సరైనవేనా కాదా అనేది కూడా భీమా సంస్థలు పరిశీలించుకున్న తరువాతే క్లెయిమ్ చేస్తాయి. అందుకే సరైన ఆసుపత్రిని ఎంచుకోవాలి. చికిత్స తీసుకున్న తేదీలు, ప్రమాదం జరిగిన తేదీలు నిర్ధారించే డాక్యూమెంట్స్, ఎఫ్ ఐ ఆర్ లు, డిశ్చార్జ్ పత్రాలు అన్ని సరైన విధంగా ఉండాలి. తేదీల విషయంలో కూడా పొరపాటు జరగకూడదు. ఒక్కోసారి ఈ పత్రాలపై ఓవర్ రైటింగ్ చేస్తూ ఉంటారు. దాని వలన కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాన్సల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా జరిగినప్పుడు బాధితులు ముందుగా బీమా సంస్థ ఫిర్యాదుల పరిష్కార అధికారిని సంప్రదించవచ్చు. ఆ అధికారికి ఓ లేఖ రాసి సమస్యని వివరించవచ్చు. వారి నుంచి ఎటువంటి స్పందన లేకుండా 30 రోజుల లోపు కోర్ట్ ను ఆశ్రయించి మీకు రావాల్సిన క్లెయిమ్ ను సొంతం చేసుకోవచ్చు.


You may also like