బ్యాంకు చెక్కులను ఎవరికైనా ఇస్తున్నారా.? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి.!

బ్యాంకు చెక్కులను ఎవరికైనా ఇస్తున్నారా.? అయితే ఈ పొరపాటు అస్సలు చేయకండి.!

by Anudeep

Ads

ప్రస్తుతం మనం ఎక్కువగా డిజిటల్ బ్యాంకింగ్ నే ఉపయోగిస్తున్నాం. ఫోన్ పే, గూగుల్ పే, పేటీమ్.. వంటి ఆప్ ల ద్వారా నగదు లావాదేవీలు జరుపుతున్నాం. అయితే.. అధికారిక పేమెంట్స్, ఎక్కువ మొత్తం లో డబ్బులు లావాదేవీలు జరపాలన్న.. మరికొందరేమో భద్రతా దృష్ట్యా చెక్ ల ద్వారా నగదు చెల్లిస్తూ ఉంటారు.

Video Advertisement

cheque 1

అయితే.. ఎవరికైనా చెక్ ను ఇచ్చేముందు కచ్చితం గా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగినా ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. మనం ఎవరికైనా చెక్ ఇచ్చేముందు.. అందులో రాసిన అమౌంట్ కు సరిపడినంత బాలన్స్ మన బ్యాంకు లో ఉందో లేదో చూసుకోవాలి. లేదంటే.. చెక్ బౌన్స్ అయ్యి.. మీకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది.

cheque 2

మనం ఇచ్చిన చెక్ లను ఆర్బీఐ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ క్లియర్ చేస్తుంది. ఈ విభాగం 24 గంటలు పని చేస్తుంది. ఆదివారాలు కూడా ఈ విభాగం తన పని తాను చేసుకుంటూ పోతుందట. ఈ లెక్కన చెక్ వెళ్ళగానే.. రెండు మూడు రోజుల్లో అమౌంట్ ట్రాన్స్ ఫర్ అయిపోవచ్చు. అలాగే.. చెక్ వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఆర్బీఐ కొత్త పద్ధతిని ప్రవేశ పెట్టింది.

cheque 3

మీరు ఎవరికైనా చెక్ ను ఇస్తే.. ఆ చెక్ ను ఒక ఫోటో తీసుకుని సేవ్ చేసుకోవాలి. తరువాత సదరు బ్యాంకు అప్లికేషన్ లో మీరు ఆ ఫోటో ను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరికైతే చెక్ ఇస్తారో.. వారు బ్యాంకు కు వెళ్లి ఆ చెక్ ను ఇచ్చినప్పుడు.. బ్యాంకు సిబ్బంది మీ అకౌంట్ లో మీరు అప్ లోడ్ చేసిన ఫోటో ను చూసి, అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే.. ఆ వ్యక్తి కి అమౌంట్ ఇస్తారు. ఒకవేళ.. మీరు ఇచ్చిన చెక్ లో వివరాలు వేరు గా ఉంటె..ఆ చెక్ ను బ్యాంకు సిబ్బంది తిరస్కరిస్తారు.


End of Article

You may also like