షాంపూ వాడేటప్పుడు ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి.. ఎందుకంటే?

షాంపూ వాడేటప్పుడు ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి.. ఎందుకంటే?

by Anudeep

Ads

షాంపూ మనం ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు జుట్టుకు రాసుకుంటాం. కానీ షాంపూ ఎలా వచ్చింది.. ఎవరు కనిపెట్టారు. అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. షాప్ కి వెళ్ళామా.. షాంపూలు తెచ్చుకున్నామా.. జుట్టుకి రాసుకున్నామా.. అంత వరకు మాత్రమే మనకు షాంపు గురించి తెలుసు..

Video Advertisement

అయితే.. కొన్ని షాంపూలు మన జుట్టుకి సరిపడకపోవచ్చు. ఫలితంగా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. చాలా మందికి షాంపూలలో రకాలు ఉంటాయని తెలియదు. మన జుట్టుకి సరిపడే రకాన్ని మాత్రమే మనం ఎంచుకోవాలి.

shampoo

షాంపూలో మూడు రకాలు ఉంటాయి. అవి ఏంటంటే.. యాసిడ్, బేసిక్, న్యూట్రల్. బేసిక్ రకాల షాంపూలు అన్నిటిలోనూ గాఢత ఎక్కువగా ఉంటుంది. ఈ షాంపూలను ఎక్కువగా వాడితే జుట్టు రాలిపోతుంటుంది. అందుకే జుట్టు రాలిపోవడం, నెరిసిపోవడం, వెంట్రుకలు సన్నబడిపోవడం, ఎండిపోవడం వంటి సమస్యలు రాకూడదు అంటే సరైన షాంపూని ఎంచుకోవాలి. షాంపూ వల్ల జుట్టు రాలిపోతోంది అన్న కారణంతో తలస్నానం చేయకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు.

మీరు ఎంచుకునే షాంపూలు పిహెచ్ 5.5 శాతం ఉండాలి. ఇది జుట్టుకి సరిపడుతుంది. ప్రస్తుతం పిల్లల కోసం లభిస్తున్న బేబీ షాంపూ లలో కూడా పిహెచ్ శాతం 5.5 ఉంటోంది. కాబట్టి పెద్దవాళ్లు వీటిని వాడొచ్చు. ఇంకా తలస్నానం చేసాక జుట్టుని డ్రయర్ తో ఆరబెట్టడం కంటే సహజ సిద్ధంగా ఆరబెట్టడం మంచిది. జుట్టుకి నూనె పెట్టడం.. మునివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయడం కూడా అవసరమే. చాలా సందర్భాలలో.. టైం లేనప్పుడు డ్రై షాంపూ వాడేస్తూ ఉంటారు. దీనిని కూడా తగ్గించాలి. తలస్నానం చేసేటప్పుడు బాగా చల్లగా, లేక బాగా వేడి నీటిని ఉపయోగించకూడదు. గోరు వెచ్చగా ఉన్న నీటిని మాత్రమే వాడాలి. జుట్టుని తుడవడానికి ప్రత్యేకమైన మైక్రో ఫైబర్ టవల్ ను ఉపయోగించాలి.


End of Article

You may also like