పెళ్ళికి వారం రోజుల ముందు ఈ ఆరు పనులు అస్సలు చేయకండి.. ఎందుకో మీరే చూడండి..!

పెళ్ళికి వారం రోజుల ముందు ఈ ఆరు పనులు అస్సలు చేయకండి.. ఎందుకో మీరే చూడండి..!

by Anudeep

Ads

పెళ్లి అనేది ఎవరికైనా ముఖ్యమైన ఘట్టమే. తమ జీవితాన్ని పంచుకోబోయే వారిని ఆహ్వానిస్తూ.. కుటుంబ సభ్యులందరి సమక్షం లో చేసుకునే అందమైన వేడుకే పెళ్లంటే. పెళ్లి అనగానే ఎక్కడలేని సందడి వచ్చేస్తుంది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు.. ఇద్దరినీ ఇరు కుటుంబాల వారు అందం గా ముస్తాబు చేస్తారు. అసలు కళ అంత వారి కళ్ళలోనే ఉందా అన్నట్లు ఉంటుంది. పెళ్లి ఘడియల ముందు.. పెళ్లికూతురు మోములో సిగ్గు.. అబ్బాయి కళ్ళలో ఆనందం.. ఇవే కదా అసలు పెళ్లి వేడుకకు సందడి తీసుకొచ్చేది.

Video Advertisement

wedding 1

అయితే.. పెళ్లి కూతురు అయినా, పెళ్లి కొడుకు అయినా వేడుక సమయంలో కళగా, అందం గా కనిపించాలని కోరుకోవడం సహజమే. అందుకోసం పెళ్ళికి రెండు మూడు నెలల ముందే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. ఏ బట్టలు వేసుకోవాలి దగ్గరనుంచి, ఎలా రెడీ అవ్వాలి, ఎవరి దగ్గర మేకప్ వేయించుకోవాలి, ఏ క్రీమ్స్ వాడాలి..? ఇలా అన్ని తెగ స్టడీ చేసేసి.. అన్నిటిని స్టార్ట్ చేసేస్తారు.

wedding 2

ఇదంతా సరే.. కానీ ఆరోగ్యం? దీని గురించి అందరు మర్చిపోతారు. తమకేంటి..? బాగానే ఉన్నాం కదా అని అనుకుంటూ ఉంటారు. బరువు గా ఉన్న వారైతే బరువు తగ్గాలి అని తెగ ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే పెళ్ళికి ఆరు రోజుల ముందు మాత్రం కొన్ని పనులను అస్సలు ట్రై చెయ్యకండి. అవి ఏంటో.. ఎందుకో.. మనం ఇప్పుడు చూద్దాం.

wedding 3

పెళ్ళిలో అందం గా అలంకరించుకుంటాం కదా.. అలాగే జుట్టు విషయం లో కూడా ఎంతో కేర్ తీసుకుంటాం. కొంతమంది రంగు వేసుకునే వారు కూడా ఉంటారు. వీరు పెళ్ళికి సమయం దగ్గర పడుతున్న టైం లో వేసుకోకపోవడమే ఉత్తమం. ఎందుకంటే.. ఒకవేళ ఏదైనా తేడా జరిగినా.. ఆ జుట్టు రంగుని మార్చలేము. పెళ్ళిలో అది మరింత ఇబ్బంది గా కనబడుతుంది.

wedding 4

ఇక పెళ్లి ఫిక్స్ అయ్యిందని చెప్పగానే.. ఫ్రెండ్స్ అంతా బ్యాచిలర్ పార్టీ అడగడం సహజమే. చాలా మంది ఇది పెళ్ళికి ముందు ప్లాన్ చేస్తారు. పెళ్ళికి ముందు రోజు రాత్రి తాగడం వంటి పనులు చేస్తుంటారు. ఆల్కహాల్ సేవించడం వలన చెమట ఎక్కువ గా పడుతుంది. పెళ్ళికి కనీసం వారం రోజుల ముందు ఆల్కహాల్ ను సేవించడం మానేయడమే మంచిది. లేదంటే పెళ్లి వేడుకలో ఎక్కువగా చెమట పట్టి చిరాకు కలుగుతూ ఉంటుంది.

wedding 5

పెళ్ళికి గడువు దగ్గరపడుతున్న టైం లో అందం గా కనిపించడం కోసం ఎలాంటి చర్మ సంరక్షణ చికిత్సలు తీసుకోవద్దు. ఇవి సక్సెస్ అయితే చర్మం మృదువుగా మారి బాగానే ఉంటుంది. కానీ, ఫెయిల్ అయితే మాత్రం పెళ్ళిలో ముఖం అందవికారం గా కనిపిస్తూ ఉంటుంది. అలాగే కొత్త కొత్త క్రీమ్స్ వంటివి రాయకపోవడమే మంచిది. అవి చర్మానికి పడకపోతే అలెర్జి వచ్చి ఇబ్బంది అవుతుంది.

wedding 6

అలాగే.. కొత్త కొత్త వ్యాయామాల జోలికి పోకుండా.. రెగ్యులర్ గా అలవాటు ఉన్న వ్యాయామాలు మాత్రమే చేయాలి. ఎందుకంటే.. ప్రయోగాలు చేయడం వల్ల ఏమైనా ఒంటినొప్పులు ఎదురైతే.. వాటి తాలూకు ఇబ్బంది మీ ముఖం లో కనిపిస్తుంది. పెళ్లి దగ్గరపడుతున్న కొద్దీ.. పనులు ఎక్కువ గానే ఉంటాయి. వాటిని బాలన్స్ చేసుకుంటూ సమయానికి నిద్రపోవాలి. నిద్ర తక్కువయినా ముఖం కళా విహీనం గా కనిపిస్తుంది.

 


End of Article

You may also like