Ads
ఉగాది పండుగను ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ పండుగ మన మొదటి పండుగ. ఈ పండగతోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతోంది. ఈ కొత్త సంవత్సరం రోజున ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉంటారు. ఉగాది యుగాది అనే పదం నుంచి పుట్టింది.
Video Advertisement
ఈ రోజునే బ్రహ్మ సమస్త సృష్టి నీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. శాలివాహనుడు పట్టాభిషిక్తుడైంది కూడా ఉగాదినాడే… ఇలా చెప్పుకుంటూపోతే ఉగాది పండగకు సంబంధించిన ఎన్నో ఇతిహాసాలు, కథలు మన పురాణాల్లో కనిపిస్తాయి.
అయితే ప్రతీ పండగకు ప్రత్యేకతలు ఎలా ఉంటాయో.. ఆయా రోజుల్లో తప్పకుండా చేయాల్సిన పనులు.. అసలు ఏ మాత్రం చేయకూడని పనులు కూడా ఉంటాయి. ఉగాది రోజున కొన్ని పనులు పొరపాటున కూడా చేయడం మంచిది కాదని చెబుతున్నారు పండితులు. ఉగాది రోజు ఆలస్యం గా నిద్ర లేవకూడదు. మాంసాహారం, మద్యం లాంటివి తీసుకోకూడదు. ఉగాది రోజు చీపురుని ఎవరికీ ఇవ్వకూడదు. కొబ్బరి నూనె కూడా ఇవ్వకూడదు.
అలాగే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తున్నపుడు దక్షిణ ముఖంగా కూర్చోకూడదు. పాత బట్టలు ధరించకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహించదు అని పండితులు చెబుతున్నారు. చిరిగిన బట్టలు, పుస్తకాలు వంటి వాటిని కూడా ఉగాది రోజు ఎవరికీ ఇవ్వకూడదు. ఈ పండుగ రోజు గొడుగులు, విసన కర్రలను పేదలకు దానంగా ఇస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది.
ఉగాది పండుగ ఈ రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి అభ్యంగ స్నానం చేయాలి. శరీరానికి, తలకు నువ్వుల నూనె రాసుకుని, సున్నిపిండి పెట్టుకుని తైలాభ్యంగ స్నానం చేయాలి. అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఉగాది పచ్చడి ఖచ్చితం గా తినాలి అని పండితులు చెబుతున్నారు.
End of Article