శ్రావణమాసంలో ఆడవాళ్లు ఆచరించే సంప్రదాయాల్లో ముఖ్యమైనది వరలక్ష్మీ వ్రతం. సుఖ సౌభాగ్యాల కోసం ఆడవారు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల ధన లాభం కలగడంతో పాటు, ఇంట్లో కూడా సుఖసంతోషాలు వర్ధిల్లుతాయి అని నమ్ముతారు.
Video Advertisement
శ్రావణమాసంలో వచ్చే మొదటి శుక్రవారం ఆడవారు వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే రెండవ శుక్రవారం రోజు కానీ, నాలుగవ శుక్రవారం రోజు కానీ లేదా శ్రావణమాసంలో వచ్చే ఏదో ఒక శుక్రవారంలో ఈ వ్రతాన్ని జరుపుకుంటారు.
అత్యంత నియామనిష్ఠలతో లక్ష్మీదేవిని పూజించి, ముత్తైదువులకి తాంబూలాన్ని ఇస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఎంతో నిష్టగా, అంకితభావంతో జరుపుకుంటారు. అయితే వరలక్ష్మీ వ్రతం చేసే సమయంలో కొన్ని పొరపాట్లు మాత్రం అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వలన దరిద్రం వాటిల్లుతుంది అని చెప్తారు. అవి ఏంటంటే.
# వరలక్ష్మి వ్రతం రోజు సూర్యోదయానికి ముందుగా తప్పకుండా నిద్రలేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్ర లేస్తే ఫలితం ఉండదు.
# వరలక్ష్మీ వ్రతం మొదలుపెట్టేముందు పసుపు గణపతిని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఏ దేవుని పూజ అయినా ముందు గణపతి పూజతోనే మొదలు పెట్టాలి కాబట్టి ఈ పూజ కూడా అలాగే చేయాలి.
# వరలక్ష్మీ వ్రతం చేసుకునే సమయంలో కుటుంబ సభ్యులు అందరూ కూడా వ్రతంలో పాల్గొని లక్ష్మీదేవిని పూజించాలి.
# స్టీలు రాగి లేదా వెండి ప్లేట్ లో కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి.
# వ్రతం చేసేటప్పుడు ఆ చేసే మనిషి సౌమ్యంగా, శాంతంగా వ్రతాన్ని చేయాలి. కోపోద్రిక్తులు అయి ఉన్నప్పుడు వ్రతం చేస్తే ఫలితం ఉండదు.
# అంతే కాకుండా ఆరోజు మాంసాహారాన్ని అస్సలు ముట్టకూడదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి.
ALSO READ : “చంద్రయాన్-3” సక్సెస్ వెనుక ఉన్న రియల్ హీరోలు వీరే..! ఎవరెవరు ఏ పదవిలో ఉన్నారు అంటే..?