మీకు కాఫీ తాగే అలవాటు ఉందా..! అయితే షాపింగ్ కి వెళ్లే ముందు ఈ పని అస్సలు చేయకండి..!

మీకు కాఫీ తాగే అలవాటు ఉందా..! అయితే షాపింగ్ కి వెళ్లే ముందు ఈ పని అస్సలు చేయకండి..!

by Anudeep

వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అన్నట్లు .. మనలో చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయాన్నే కాఫీ తాగకపోతే ప్రాణం పోయినంత పని చేస్తారు చాలామంది. వేడి వేడి కాఫీ కడుపులోకి వెళితేకాని పని మొదలుపెట్టలేరు.  నలుగురు స్నేహితులు కలిసి బయటికి వెళ్ళినా ముందు ఎక్కువగా గుర్తుకు వచ్చేది కాఫీ. పని ఒత్తిడి ఎంత ఉన్నాగాని ఒక కప్పు కాఫీ తాగితే చాలు అలసట మొత్తం మటుమాయం అయిపోతుంది.

Video Advertisement

అధికంగా ఇష్టపడే కాఫీ తో లాభాలుతో పాటు, నష్టాలు కూడా ఉంటున్నాయి. ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా.. అయితే ఈ విషయం గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా నిర్వహించిన పరిశోధన ప్రకారం ఇంటి నుంచి కాఫీ తాగి షాపింగ్ కి వెళ్లేవారిలో మెదడులోని ఆలోచనలు వ్యతిరేకంగా పని చేస్తాయట. షాపింగ్ లో కావలసిన దానికన్నా ఎక్కువగా కొనుక్కొని తీసుకువెళ్తారట. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కాఫీలో ఉండే కెఫిన్ నరాలను ప్రేరేపించడం ద్వారా శరీరానికి ఉపశమంతో పాటు శక్తిని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇది డోపమైన్ రసాయనాన్ని మన శరీరంలో విడుదల చేస్తుంది. దీని ద్వారా వాళ్ళు అనుకున్న దాని కన్నా ఎక్కువ వస్తువులు కొన్ని, ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు అని తేలింది.

 

స్పెయిన్ మరియు ఫ్రాన్స్ లో డిపార్ట్మెంటల్ స్టోర్ ను సందర్శించే 300 కస్టమర్ల పై ఈ పరిశోధన చేయడం జరిగింది. వాళ్ళలో కొంతమందికి కెఫిన్ ఉన్న కాపీని, మరికొంతమందికి కెఫిన్ లేని కాఫీని, మిగిలినవారికి  నీటిని ఇచ్చారు. వారు డిపార్ట్మెంట్ స్టోర్ లో నుంచి బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ బిల్లులు పరిశీలించగా కాఫీ తాగే వారే ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నట్లు పరిశోధనలో తెలిసింది.


You may also like