Ads
మోటార్ సైకిల్ రైడింగ్ అంటే యువతకు పెద్ద క్రేజ్.. అంతే కాదు అలా రయ్.. రయ్ మంటూ తిరగడం అంటే వారికి భలే సరదా ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లో రెండు మూడు మోటార్ సైకిళ్లు, స్కూటర్లు ఉంటున్నాయి. పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ బైక్ అనేది కామన్‌గా మారిపోయింది.
Video Advertisement
అయితే ఈ మధ్య సోషల్ మీడియా లో బైక్స్ కి సంబంధించి కొన్ని పుకార్లు వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు మండిపోతుండటం తో వాహనాలకు ఫ్యూయల్ ఫుల్ ట్యాంకు చేపించవద్దని.. ఒకవేళ అలా చేస్తే వాహనం పేలిపోయే ప్రమాదం ఉందని పలు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఫ్యూయల్ ట్యాంకును ఒకసారి తెరిచి ఉంచాలని చెబుతూ ప్రచారం జరుగుతోంది.
కానీ నిజమేంటంటే.. శీతాకాలం, వేసవికాలం అనే తేడా లేకుండా ఆయిల్ నింపేటపుడు వాహనాన్ని తయారుచేసిన కంపెనీ సూచనల్ని పాటించాలి. అయితే ప్రతి బండి ఆయిల్ ట్యాంక్ కి రెండుసార్లు కోటింగ్ ఇస్తారు తయారీదారులు. నార్మల్ పెయింట్ తో పాటు నానో మెటాలిక్ కోటింగ్ కూడా ఇస్తారు. దాంట్లో కాపర్ ని వాడతారు. దాని వాళ్ళ ట్యాంక్‌లకు నిప్పు అంటుకొని ప్రమాదం చాలా తక్కువ.
అలాగే బైక్ ఫ్యూయల్ ట్యాంక్ లో ఆక్సిజెన్ శాతం తక్కువగా ఉండటం వల్ల కూడా మంటలు అంటుకోవు. కేవలం టాంక్ కి ఏదైనా రంధ్రం పడి ఆయిల్ లీక్ అయినపుడు మాత్రమే మంటలు వచ్చే అవకాశం ఉంది అని నిపుణులు వెల్లడిస్తున్నారు. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు పెట్రోల్, డీజిల్ వాయురూపంలో ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాలలో కూడా అగ్నిప్రమాదాలు సంభవించవచ్చు.
210 డిగ్రీల సెల్సియస్, 246 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల మధ్య మంటలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొన్ని వాహనాలకు ఎవాపరేటివ్ ఎమిషన్ సిస్టమ్ (ఈవీఏపీ)లో భాగంగా ఫ్యూయల్ ట్యాంకులకు ప్రెషర్ సెన్సార్ ఉంటుంది. ఇది ప్రెషర్ ఏ స్థాయిలో ఉన్నదో గుర్తిస్తుంది. కాబట్టి ఫుల్ ట్యాంక్ చేయించడం వల్ల వాహనం మాటలకు ఆహుతి అవుతుంది అన్నదానికి నిరూపణలు లేవు.
End of Article