కొత్తగా తల్లిదండులయ్యారా..? అయితే ఈ విషయాలను అస్సలు మార్చిపోకండి..!

కొత్తగా తల్లిదండులయ్యారా..? అయితే ఈ విషయాలను అస్సలు మార్చిపోకండి..!

by Megha Varna

Ads

పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా నెలల పిల్లలని చూసుకోవడం చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఏది ఏమైనా తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. పిల్లలు నిద్రపోతున్నారా పిల్లలకి ఆకలి వేస్తుందా ఇవేమీ కూడా వాళ్ళు చెప్పలేరు. కాబట్టి తల్లిదండ్రులకి వీళ్ళతో పెద్ద సమరంలానే ఉంటుంది.

Video Advertisement

పైగా ప్రతి చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పిల్లల్ని అర్థం చేసుకోవాలనుకుంటే కొత్త పేరెంట్స్ వీటిని కచ్చితంగా చూడాల్సిందే. దీనితో వాళ్ళని పెంచడం సులభం అవుతుంది.

#1. ఆకలి వేస్తుందా లేదా అనేది ఇలా చూడండి:

పిల్లలు వాళ్ళ యొక్క గుప్పెడును మూసి ఉంచితే ఆకలి వేస్తోందని అర్థం అదే ఒకవేళ వాళ్ళు తెరిచి ఉంచితే వాళ్ళ కడుపు ఫుల్ గా ఉన్నట్లు.
పిల్లలు యొక్క బాడీ లాంగ్వేజ్ పట్ల అటెన్షన్ తో ఉండండి.
పిల్లలు పదే పదే తన్నుతుంటే ఆడుకోవాలని వాళ్ళనుకుంటున్నారని అర్థం.

#2. నొప్పి తగ్గాలంటే ఇలా చేయండి:

పిల్లలు యొక్క కాలి వేళ్లను నొక్కితే పంటి నొప్పులు తగ్గుతాయి. బొటన వేలుని మసాజ్ చేస్తూ ఉండండి. అప్పుడు పంటి నొప్పులు తగ్గుతాయి.
బొటనవేలు మధ్యలో కనక మసాజ్ చేస్తే ముక్కు కారటం తగ్గుతుంది. మోచిప్పల వద్ద మసాజ్ చేస్తే చెస్ట్ కంజెషన్ తగ్గుతుంది.
పాదాల మధ్యన మసాజ్ చేస్తే కడుపునొప్పి వంటివి ఉండవు.
పాదాల కింద భాగంలో నొక్కితే బ్లోటింగ్, కాన్స్టిపేషన్ సమస్యలు ఉండవు.

#3. పిల్లల్ని కంఫర్ట్ గా ఎలా చూసుకోవాలి:

కడుపులో నుండి వచ్చిన తరవాత ఇక్కడ వారికి కంఫర్ట్ ఉండదు. అందుకే స్వెడలింగ్ చేయడం, ఉయ్యాల ఊపడం, బేబీస్ ని సైడ్ కి ఎత్తుకోవడం చేస్తే కంఫర్ట్ గా ఉండచ్చు.

#4. పిల్లలని ఎలా ఎత్తుకోవాలి..?

పిల్లల్ని ఎత్తుకోవడానికి చాలా రకాల క్యారియర్స్ వచ్చాయి వీటిని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల హిప్ జాయింట్స్ మరియు కింద భాగానికి ప్రెషర్ ఉండేటట్టు చూసుకోవాలి.

#5. ఎందుకు పిల్లల చేతులు పట్టుకుని ఎత్తుకోకూడదు ..?

ఇలా అసలు ఎత్తుకోకూడదు ఎందుకంటే చిన్నపిల్లలు వీక్ గా ఉంటారు ఇటువంటి తప్పులు చేయడం వలన పెద్దయ్యాక సమస్యలు కలిగే అవకాశం ఉంది.

#6. ఫేస్ మసాజ్ ఎలా చేయాలి..?

మీ యొక్క బొటనవేలతో మసాజ్ చేయండి. మూతి పైన రెండు సైడ్లు రెండు బొటన వేళ్ళతో మసాజ్ చేయండి. ఈ ఇమేజ్ లో ఉన్నట్టు మసాజ్ చేయడం కరెక్ట్ ప్రాసెస్.

#7. ఎలా పిల్లల్ని ప్రశాంతంగా ఉంచొచ్చు..?

ఈ ఫోటోలో ఉన్నట్లుగా మీరు మీ పిల్లల్ని ఆడించొచ్చు. ఇలా ఉంచడం వల్ల వాళ్లు ఇబ్బందికరంగా ఫీల్ అవ్వరు.

#8. పిల్లలకి పాటల్ని ఎందుకు పెట్టాలి..?

దీనిని మోసాట్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. మ్యూజిక్ ని పెట్టడం వల్ల ప్రశాంతంగా ఉంటారు.

#9. ఎందుకు నాయిస్ కూడా చేయాలి..?

వాక్యూమ్ క్లీన్ చేయడం వంటివి చేయడం వలన నాయిస్ వస్తుంది. కానీ విని విని బేబీస్ కొంచెం సేపు తర్వాత నిద్రపోతారు. ఇలాంటి సౌండ్స్ వల్ల వాళ్ళు నిద్ర పోగలరు.

#10. పిల్లలను నిద్ర లేపి ఫీడింగ్ ఎందుకు ఇవ్వాలి..?

చాలా మంది పిల్లలు ఎక్కువ సేపు నిద్రపోతారు అటువంటప్పుడు వాళ్ళని లేపి ఫీడింగ్ ఇవ్వడం మంచిదే. దీనివలన వాళ్ళకి ఆకలి తగ్గుతుంది. పైగా కంఫర్ట్ గా ఉంటారు. ఇబ్బందికరంగా ఉండదు.

#11. పిల్లలను ఎందుకు రాత్రిపూట ఉయ్యాలలో పడుకోబెట్టకూడదు..?

కొన్ని కొన్ని సార్లు పిల్లలు దొర్లిపోతూ లేచేస్తూ ఉంటారు. నడక వచ్చిన వాళ్ళు అయితే నడిచేసి బయటకి వచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఉయ్యాలలో వేసేటప్పుడు వాళ్లు కాస్త మెళుకువుగా ఉండేటప్పుడు మాత్రమే వేయాలి. లేదంటే పిల్లలు ఏడుస్తున్నప్పుడు అయినా సరే వాళ్ళను ఉయ్యాలలో వేసి ఏడుపుని ఆపేలా చెయ్యాలి తప్ప రాత్రి మాత్రం ఉయ్యాలలో వెయ్యకూడదు.

#12. ఎందుకు ఇలా లైట్లు వేయాలి..?

పిల్లలకి పగలు రాత్రి తేడా తెలియదు. అయితే మీరు బెడ్ లాంప్ వంటివి ఉపయోగించినప్పుడు పిల్లలకి రాత్రి అయ్యింది అని తేడా తెలుస్తుంది. పైగా వాళ్ళు నిద్ర పోవాలని వారికి తెలుస్తుంది. కనుక ఇలా లైట్లు వేసి పగలకి రాత్రికి తేడా చూపించాలి.


End of Article

You may also like