మనం హెల్ది గా మన రోజుని ప్రారంభించాలంటే.. ఆరోగ్యకరమైన ఆహరం తప్పనిసరి. అయితే.. ఉదయం నిద్ర లేవడం ఏ మాత్రం ఆలస్యమైనా చాలా మంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేయడమో.. లేక అందుబాటులో ఉన్న ప్యాకెడ్ ఫుడ్ తినేయడమో చేస్తుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.
ఖాళీ కడుపుతో మనం ఏమి ఆహరం తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయం. రోజంతా ఆక్టివ్ గా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా మంచి బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోవాలి.
అయితే.. రోజంతా చురుకుగా ఉండడం కోసం ఉదయాన్నే ఈ ఆహారాలను తీసుకోండి. ముందుగా ఉదయాన్నే జీలకర్ర వాటర్ తాగడం చాలా మంచిది. రాత్రి పడుకునే ముందే ఒక గ్లాస్ లో జీలకర్ర వేసి నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని వ్యర్ధాలన్నీ బయటకు పోతాయి. అలాగే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా మీకు మంచి ఆరోగ్యాన్నిస్తాయి.
నానబెట్టిన బాదం పప్పులు, వాల్ నాట్స్, బ్లాక్ కిస్ మిస్ వంటివాటిని తినడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. శరీరం ఫిట్ గా ఉండాలనుకునేవారు, జిమ్ కు వెళ్లే వారు వీటిని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా బొప్పాయి పండుని కూడా ఖాళీ కడుపుతో తినడం వలన చాలా ఫలితాలే ఉంటాయి. బొప్పాయిలో ఉండే పీచు పదార్ధాలు జీర్ణ వ్యవస్థని ఆరోగ్యంగా ఉంచుతాయి.. శరీరంలోని చెడు కొవ్వుని బయటకు తొలగిస్తాయి.