Ads
ఈరోజుల్లో ఎంత సంపాదించాం అన్న దానికంటే.. ఎంత పొదుపు చేసాం అన్నదే ముఖ్యం. ఎంత ఎక్కువ సంపాదించుకున్న.. చివరకు రూపాయిని కూడా దాచుకోలేకపోతే వృధా కదా. అందుకే డబ్బు సంపాదించడమే కాదు.. దానిని జాగ్రత్తగా దాచుకోవడం కూడా ముఖ్యమైనదే.
Video Advertisement
ఈ అంశంపై ప్రముఖ జ్యోతిష్యురాలు రాఖీ మిశ్రా కొన్ని విషయాలను పంచుకున్నారు. కొంతమంది తమకు తెలియకుండానే తమ పర్స్ లో కొన్ని అమంగళకరమైన వస్తువులను ఉంచుకుంటూ ఉంటారని.. ఫలితంగా వారి డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుందని అంటుంటారు.
అశుభకరమైన వస్తువులను పర్స్ లో పెట్టుకోవడం వలన వారిపై ప్రతికూల ఒత్తిడి పెరుగుతుందని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే వారి జేబు త్వరగా ఖాళీ అయిపోతూ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఓ ఐదు విషయాలలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొచ్చారు. బిల్లు, లేదా ఈఎంఐ పేపర్లు వంటి వాటిని పొరపాటున కూడా జేబులో పెట్టుకోకూడదు.
అలాగే ఫోన్ బిల్లు, ఇంటి బిల్లు లేదా ఇతర ఖర్చులకు సంబంధించిన బిల్లును కూడా పెట్టుకోకూడదు. మరికొంతమంది తమ పూర్వికులపై ఉన్న అమిత ఇష్టంతో వారి ఫోటోలను పర్స్ లో పెట్టుకుంటూ ఉంటారు. పూర్వీకుల ఆశీర్వాదం మనపై ఎప్పటికీ ఉండాలి. వారి ఆశీర్వాదం ఉంటేనే మనం ఆర్థికాభివృద్ధిని సాధించగలుగుతాము. అయితే.. వారి ఫోటోలను పర్స్ లో పెట్టుకోవడం కాకుండా.. ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవడం మంచిది. కొందరు దేవతల ఫోటోలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. అయితే.. దేవతల ఫోటో పెట్టుకోవడం కంటే ఇంట్లో పెట్టుకుని పూజించుకోవడం మంచిది. మరికొందరు కీస్ ను కూడా పెట్టుకుంటారు. ఇవి కూడా పర్స్ లో పెట్టుకోవద్దు. నాణేలు వంటి లోహపు వస్తువులను కూడా పర్స్ లో ఉంచుకోవడం మంచిది కాదు. అలాగే డబ్బుని కూడా ఎడాపెడా కుక్కుకోవడం కాకుండా.. వాటిని నీట్ గా లెక్కించుకుని క్రమబద్ధీకరించుకుని పెట్టుకోవడం వలన బాగా కలిసి వస్తుంది.
End of Article