మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? అయితే ఎప్పటికీ ధనవంతులు కాలేరట.. అవేంటో చూడండి..!

మీ ఇంట్లో ఈ వస్తువులు ఉన్నాయా..? అయితే ఎప్పటికీ ధనవంతులు కాలేరట.. అవేంటో చూడండి..!

by Anudeep

ధనం ప్రతి ఒక్కరికీ అవసరమైనదే. అందరు అందుకోసమే కష్టపడుతూ ఉంటారు. కొందరు సంపాదించిన డబ్బుని జాగ్రత్తగా దాచుకుంటూ ధనవంతులవుతూ ఉంటారు. మరికొందరేమో ఎంత డబ్బు సంపాదించుకున్నా అది నిలవక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే.. కొన్ని విషయాలను తెలుసుకుని, జాగ్రత్త పడితే డబ్బు ఖర్చు అవ్వకుండా జాగ్రత్త పడచ్చు.

Video Advertisement

చాలా మంది ఇంట్లో అవసరం లేని పాత వస్తువులను బయట పడేయకుండా ఇంట్లోనే ఉంచుకుంటూ ఉంటారు. తర్వాత ఎప్పుడో అవసరమవుతాయన్న ఉద్దేశ్యంలోనో, లేక పడేయడం ఇష్టం లేకో వాటిని ఇంట్లోనే అటకపై పెట్టడమో.. లేదా టెర్రస్ పైన పడేయడమో చేస్తుంటారు.

home 1

కానీ, ఇలా చేయడం వలన ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుందట. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులు ఇంట్లో ఆర్ధిక ఇక్కట్లను తీసుకొచ్చి, ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేలా చేస్తాయట. ముఖ్యంగా పగిలిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదు. ఆ అద్దాన్ని అస్సలు వాడకూడదు. అద్దం పగిలిన వెంటనే బయటపడేయాలి. అలానే ఇంటికి సమీపంలో తేనెతుట్టలు పట్టుకుంటే.. కొందరు వాటిని అలానే వదిలేస్తారు. అలా కాకుండా వాటిని వెంటనే వదిలించుకోవాలి.

home 2

అలాగే ఇళ్ల కిటికీలపై, ఇంట్లో అరలపై పక్షులు గుడ్లు, గూళ్ళు పెట్టుకుంటే.. వాటిని కూడా తొలగించుకోవడం మంచిది. ఇంట్లో సాలీడు పురుగులు గూళ్ళు పేర్చుకున్నా కూడా అప్పులు పెరుగుతుంటాయి. ఇవన్నీ చేసుకుంటూ.. కేవలం అదృష్టాన్ని మాత్రమే కాకుండా మన కష్టాన్ని కూడా నమ్ముకోవాలి.


You may also like