Ads
ప్రతి ఇంట్లో కామన్ గా ఉండే వస్తువులలో మంచం ఒకటి. పని అంతా అయ్యాక రెస్ట్ తీసుకోవడం కోసం.. అందరు సౌకర్యం కోసమే మంచాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఉదయం సమయంలో అందరు నిద్ర లేచి రోజువారీ పనుల్లో పడిపోతూ ఉంటారు. ఈ టైములో కొన్ని వస్తువులను తర్వాత సర్దుకోవచ్చులే అనో.. లేక మరో ప్లేస్ కనిపించకో మంచం పైనే పడేస్తూ ఉంటారు.
Video Advertisement
అయితే.. కొన్ని రకాల వస్తువులను మంచంపై పెట్టడం వలన దరిద్రం వస్తుంది. చాలా మందికి ఇంట్లో మంచం పక్కనే బీరువా ఉంటుంది. ఈ బీరువాలో ఏమైనా తీసుకుంటున్నప్పుడో.. లేక ఏమైనా సర్దుతున్న సమయంలోనో డబ్బు లేదా కొత్త బట్టలు, నగలు వంటివాటిని మంచంపై పెడుతూ ఉంటాం.
నిజానికి ఇలాంటి వస్తువులను మంచంపై పొరపాటున కూడా పెట్టకూడదట. డబ్బు, బంగారం వంటి వాటిని మంచంపై పెట్టడం అస్సలు మంచిది కాదట. మంచంపై ఎటువైపు పడుకుంటామో.. తిరిగి నిద్ర లేచేటప్పుడు కూడా అటువైపు నుంచే లేవాలట. అప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయట. ఇంకా గుడి నుంచి వచ్చిన తరువాత అస్సలు మంచంపై కూర్చొనకూడదని చెబుతుంటారు.
కొంతమంది దిండు కింద డబ్బు ఉంచితే.. సంపద పెరుగుతుంది అని భావిస్తూ ఉంటారు. నిజానికి మంచంపై డబ్బు ఉంచితే.. లక్ష్మి దేవి ఆగ్రహిస్తుందట. ఇక కొత్త బట్టలని కూడా మంచంపై పెట్టకూడదట. అలా చేయడం వలన కొత్త బట్టలను కొనుక్కోవడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుందట. అలాగే పసుపు, కుంకుమ, బియ్యం రాడానికి ఉపయోగించే చాట లాంటివి కూడా ఉంచకూడదు. కొంతమంది మంచంపైనే భోజనం చేస్తుంటారు. ఆ టైములో అన్నం, పప్పు కూరలు లాంటివి మంచంపై ఉంచుతారు. వీటిని కూడా మంచంపై ఉంచకూడదు. అసలు మంచంపై భోజనం చేయడం కూడా సరైన పద్ధతి కాదు.
End of Article