పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ ఇలా చేయరు..!

పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెడుతున్నారా? ఈ విషయం తెలిస్తే ఇంకెప్పుడూ ఇలా చేయరు..!

by Anudeep

Ads

మండుతున్న వేసవి నుంచి ఉపసమనం పొందడానికి చాలామంది ఈసీజన్ లో పుచ్చుకాయ ముక్కలను ఇష్టపడతారు.వేసవికాలంలో ఎండల్లో పుచ్చకాయ ముక్కలను తింటే ఆ అనుభూతే వేరు. పుచ్చకాయ ముక్కలను తినటం వలన వేసవిలో కలిగే దాహం బాగా తీరుతుంది.

Video Advertisement

అయితే మనం పుచ్చకాయ ముక్కలను తిని గింజలను పడేస్తూ ఉంటాం. అయితే గింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చకాయ గింజల్లో విటమిన్స్‌తో పాటు మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, పాస్పరస్, కాపర్, జింక్, మాంగనీస్ సమృద్ధిగా ఉంటాయి.

water melon 3

అయితే.. చాలా మంది సమ్మర్ రాగానే ముందు చేసే పని పుచ్చకాయలు కొనడం. ఇవి మార్కెట్ లో కొని తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని, చల్లగా అయిన తరువాత తింటూ ఉంటారు. అక్కడే అందరు పొరపాటు చేస్తూ ఉంటారు. పుచ్చకాయలు ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం మంచిది కాదట. నిజానికి పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే సమ్మర్ లో పుచ్చకాయను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.

water melon

కానీ, ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయను తినడం వలన దానిలో ఉండే పోషక విలువలు బాగా తగ్గిపోతాయట. ఎండ మండిపోతున్నప్పుడు ఫ్రిడ్జ్ లో ఉంచిన చల్లని పుచ్చకాయని తినడం వలన మంచి అనుభూతి కలుగుతుంది. కానీ పుచ్చకాయలో ఉండే పోషకాలను అందుకోవాలంటే మాత్రం పుచ్చకాయని ఫ్రిడ్జిలో పెట్టకుండానే తినాలట. ఫ్రిడ్జ్ లో పెట్టడం కంటే.. గది ఉష్ణోగ్రతలోనే పుచ్చకాయను ఉంచి తినడం మంచిదట. అయితే ఎవరికైనా మండే ఎండలో చల్లని పుచ్చకాయ తినాలని అనిపిస్తుంది. అందుకే.. అలాంటి టైం లో పుచ్చకాయ జ్యూస్ లేదా స్మూతీలను తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చల్లగా తాగడం మంచిది.


End of Article

You may also like