Ads
మీ శరీరం యొక్క మొత్తం ఆరోగ్యంలో మీ మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి శరీరం నుండి వ్యర్థాలు మరియు అవసరం లేని నీటిని తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలోని నీరు, లవణాలు మరియు ఖనిజాలను ఆరోగ్యకరమైన సమతుల్యతలో ఉంచడానికి కిడ్నీలు దోహదం చేస్తాయి. అయితే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని కొన్ని అలవాట్లు మనకు తెలియకుండానే కిడ్నీల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
కొన్ని విటమిన్లు మీ మూత్రపిండాలకు నిత్యం అవసరం అవుతూ ఉంటాయి. మీరు తీసుకునే ఆహారంలో విటమిన్ల లోపం ఉంటె.. ఆ ప్రభావం కిడ్నీల ఆరోగ్యంపై పడుతుంది. మూత్రపిండాల వ్యాధి ఉన్నవారిలో విటమిన్ డి లోపం ఉండడం చూస్తూనే ఉంటున్నాం. విటమిన్ B6 ఇతర ఔషధాలతో పాటుగా తీసుకుంటున్నప్పుడు మీ కిడ్నీల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రతిరోజూ 10-15 నిమిషాలు ఎండలో కూర్చుంటే విటమిన్ డి పొందవచ్చు. విటమిన్ B6 సాల్మన్, చిక్‌పీస్, బంగాళదుంపలు మరియు ఇతర పిండి పదార్ధాలలోను లభిస్తుంది. ఇందుకోసం కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పెయిన్ కిల్లర్లను అతిగా తీసుకోవడం వల్ల మీ కిడ్నీలకు ప్రమాదకరం కావచ్చు. ఆ మాత్రలు మీ నొప్పులను తగ్గించినా.. కిడ్నీలకు మాత్రం తీరని అన్యాయం చేస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను అధికంగా ఉపయోగించడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తుంటాయి.
ప్రాసెస్ చేసిన భోజనంలో సోడియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలు దెబ్బ తినడానికి కారణం అవుతాయి. ప్రతి వారం కనీసం మూడు సార్లు వ్యాయామం చేసే వ్యక్తులలో కిడ్నీలో రాళ్లు తక్కువగా ఉండడం గమనించవచ్చు. మూత్రపిండాల పనితీరు బలహీనంగా ఉన్నవారు కూడా క్రమం తప్పకుండ నడక సాగించడం వలన వారి ఆరోగ్యం మెరుగుపడవచ్చు.
End of Article