పెళ్లి అనేది జీవితంలో ఎంతో మధురమైన ఘట్టం. ప్రతి ఆడపిల్ల తన జీవితంలోకి రాబోతున్న భాగస్వామి గురించి అనేక కలలు కంటూ ఉంటుంది. తనను చేపట్టే వాడు ఈ విధంగా ఉండాలి అంటూ కొంత అవగాహనకు వస్తుంది. అలాగే అబ్బాయిలకు కూడా తాను చేసుకోబోయే అమ్మాయి గురించి కొన్ని ఊహలు, అంచనాలు ఉంటాయి. ఇది సహజంగానే జరుగుతుంటుంది.
కాబట్టి అబ్బాయిలు కాంప్రమైస్ అయిపోకుండా.. తమకు నచ్చిన అమ్మాయినే జీవిత భాగస్వామిగా ఎంచుకోవాల్సి ఉంటుంది. కట్నం ఎక్కువగా ఇచ్చే అమ్మాయిలు రావాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు.
కానీ కట్నం ఇచ్చే అమ్మాయి కంటే.. మీ మనసు గుర్తెరిగి.. తన మనసుని మీతో పంచుకోగలిగే అమ్మాయి అయితే మీ జీవితం బాగుంటుంది. అరిధికంగా మీ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. ఫ్యూచర్ లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందట. అల్లరి చిల్లరిగా గోల చేసే అమ్మాయిలు అయితే.. ఏదైనా సమస్య వచ్చినప్పుడో.. గొడవ వచ్చినప్పుడో అందరిలోనూ అరిచి అల్లరి చేస్తుంటారు. అలా కాకుండా.. నిదానంగా ఆలోచించి పరిస్థితికి తగ్గట్లు ప్రవర్తించే అమ్మాయిలు అయితే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది.
ఇలా అరిచి గోల చేసేవారు.. మీతో పాటు మీ ఇంట్లో పెద్దవాళ్లకు కూడా మర్యాద ఇవ్వరు. అటువంటి వారికంటే.. ఇంట్లో పెద్దలను గౌరవిస్తూ.. వారితో కలిసిపోయే అమ్మాయిలను తెచ్చుకోవాలట. కాలానికి తగ్గట్లే అభిరుచులను అప్ డేట్ చేసుకుంటూ.. మీ జీవితంలో ఒడిదుడుకలను ఎదుర్కోవడంలో సాయం చేసే అమ్మాయి అయితే మీ జీవితం ఆనందమయమవుతుంది. అదే సమయంలో.. మీరు కూడా ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటె.. మీ పట్ల ఆమెకూ మరింత ప్రేమ పెరిగి.. మీ బంధం బలపడుతుంది.
Note: Images used in this article are for reference purposes only.