ఒకసారి ఉపయోగించిన ఆయిల్ నే మరోసారి వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే.. తప్పకుండ చదవండి!

ఒకసారి ఉపయోగించిన ఆయిల్ నే మరోసారి వాడుతున్నారా..? అయితే ఇది మీకోసమే.. తప్పకుండ చదవండి!

by Anudeep

Ads

చాలా మంది బయట ఫాస్ట్ ఫుడ్ ను అవాయిడ్ చేయడానికి మెయిన్ రీసన్ ఏంటి అంటే.. ఆయిల్. ఎందుకంటే బయట హొటెల్స్లో వారు ఎటువంటి ఆయిల్ ను ఉపయోగిస్తారో తెలియదు. ఒకసారి వాడిన ఆయిల్ ను తిరిగి ఎన్ని సార్లు వాడతారో కూడా చెప్పలేం. దీనివలన చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.

Video Advertisement

అసలు ఆయిల్ వేయకుండా వంట చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇక పకోడీలు, జంతికలు, బజ్జిలు లాంటి ఫుడ్ తినాలంటే మాత్రం ఆయిల్ ను ఎక్కువగానే వాడాల్సి ఉంటుంది.

oil 2

అసలు చిక్కంతా.. ఇవి వండగా మిగిలిపోయిన ఆయిల్ వలన వస్తుంది. ఇలా మిగిలిపోయిన ఆయిల్ ను చాలా మంది తిరిగి ఉపయోగిస్తూ ఉంటారు. దీని వలన ఎక్కడలేని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇలా ఒకసారి వాడిన నూనెను ఎంత తక్కువ వాడితే అంత మంచిది.

oil 3

ఇలా ఒకసారి వేయించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడడం వలన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే కాకుండా పార్కిన్సన్, చిత్త వైకల్యం, అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. నూనెను ఒకసారి వేడి చేసిన తరువాత.. తిరిగి మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వలన పెద్ద మొత్తంలో ఆల్డిహైడ్లు విడుదల అవుతూ ఉంటాయి. అందుకే వంటలో ఒకసారి వాడిన నూనెను పదే పదే వాడకూడదు. ఎప్పుడైనా ఫ్రై ఐటమ్స్ చేసుకున్నా.. తక్కువ మొత్తంలో నూనె వాడుకుని.. మిగిలిన నూనెను మళ్ళీ వేయించేందుకు కాకుండా.. ఏదైనా పోపులో వేసుకోవడానికి వాడుకోవడం ఉత్తమం.


End of Article

You may also like