Ads
పెళ్లితో ఎవరికైనా కొత్త జీవితం ప్రారంభం అవుతుంది. అమ్మాయిల జీవితంలో భర్తగా.. అలాగే అబ్బాయిల జీవితంలోకి భార్యగా కొత్త వ్యక్తి వస్తుంటారు. మిగతా అన్ని బంధాలు ఎలా ఉన్నా.. భార్యా భర్తల బంధం మాత్రం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే వారిద్దరూ జీవితాంతం కలిసి ఉండాలి.
Video Advertisement
ఎన్ని అభిప్రాయం భేదాలు, ఆటుపోట్లు వచ్చినా వారిద్దరూ సర్దుకుపోతూ కలిసి మెలసి ఉండాలి. కొన్ని సార్లు భర్త కూడా సర్దుకుపోతూ ఉండాల్సి వస్తుంది. ఇద్దరు సర్దుకుపోకుండా మాటలు అనుకుంటూ ఉంటె.. ఆ బంధం బీటలు వారుతుంది.
అయితే.. భర్త అయినా.. భార్య అయినా తమ భాగస్వామి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి. కొందరు భార్య భర్తలలో అవసరం కోసమే కలిసుండడం తప్ప భార్యా భర్తల మధ్య ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అయితే.. ఇటువంటి బంధాలలో ప్రేమ ఎక్కువ కాలం నిలబడదు. ఇలా కాకుండా బంధాలను ప్రేమతో నిలుపుకోవాలి. భార్య భర్తని, భర్త భార్యని పరస్పరం గౌరవించుకోవాలి. అయితే వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోవాలంటే.. భార్యలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ ఫంక్షన్ కి వెళ్లినా.. భర్తని తక్కువ చేసి మాట్లాడకూడదు.
దానివల్ల అతని గౌరవం తగ్గడమే కాకుండా భార్యకి కూడా చెడ్డ పేరు వస్తుంది. మెట్టింట్లో జరిగే విషయాలను పొరపాటున కూడా పుట్టింట్లో చెప్పకూడదు. దానివలన పుట్టింటివాళ్లకు మెట్టింటి వాళ్లపై చెడు ఉద్దేశ్యం కలిగే అవకాశం ఉంటుంది. చుట్టూ ఉండే వారికి భర్త గురించి అసలు చెప్పకూడదు. దానివలన అతని గౌరవం తగ్గుతుంది. భర్త ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అతనితో నీకేం తెలుసు అన్నట్లు వాదించకూడదు. దీనివలన అతనికి ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. సమయానుకూలంగా సలహాలు ఇవ్వాలి. పిల్లల ముందు పొరపాటున కూడా భర్తని తిట్టకూడదు. దీనివలన వారు తండ్రిని గౌరవించరు. అందుకే ఏమి ఉన్నా.. ఏకాంతంగా ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి తప్ప.. పిల్లల ముందు మాట్లాడుకోకూడదు.
End of Article