పెళ్లి రోజు పెళ్లి కూతురుతో అస్సలు అనకూడని 6 విషయాలు ఇవే..! 3 వ ది ముఖ్యమైంది..!

పెళ్లి రోజు పెళ్లి కూతురుతో అస్సలు అనకూడని 6 విషయాలు ఇవే..! 3 వ ది ముఖ్యమైంది..!

by Anudeep

Ads

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం . ముఖ్యంగా ఆడపిల్లకి. ఎందుకంటే పెళ్లి తర్వాత తన పుట్టింటిని వదిలేసి, అత్తవారింట్లో కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనసులో ఎన్నో సందేహాలు, ఆలోచనలు సహజం. అలాంటప్పుడు మనం పెళ్లి కూతురితో మరికొన్ని విషయాలు మాట్లాడి తనని మరింత కృంగదీయకూడదు. పెళ్లికూతురితో ఏ విషయాలు మాట్లాడకూడదో, వేటికి వాళ్లెక్కువ డిస్టర్బ్ అవుతారో ఒకసారి చదవండి.

Video Advertisement

 

1. పెళ్లంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఆడపెళ్లి వారికి మరీ ఖర్చులెక్కువ, కట్నం, పెళ్లి పనులు వగైరా బరువంతా ఆడపెళ్లి వారిపైనే ఉంటుంది. కాబట్టి మనం పెళ్లికూతురితో కట్నం ఎంత? పెళ్లికి ఎంత ఖర్చుపెడుతున్నారు ? లాంటి క్వశ్చన్స్ అడగకూడదు. దీనివల్ల మనకి తెలియకుండానే ఆ అమ్మాయిలో ఆలోచన స్టార్ట్ అవుతుంది నా గురించి మా ఫ్యామిలి ఇంత ఖర్చు పెడుతుందా అని.

2.జీవితంలో ఒకేసారి వచ్చే ముఖ్యమైన అకేషన్ పెళ్లి . అలాంటి పెళ్లి లో అందంగా కనపడాలని బంధువులే అనుకుంటారు. మరి పెళ్లికూతురు ఇంకెంత అందంగా ఉండాలి. దానికోసం పెళ్లికి ముందే ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంది. దానివల్ల కొంచెం లావైంది అనుకోండి. అంతే మనవాళ్లు ఒళ్లు చేసినట్టున్నావ్ అని కామెంట్స్ చేస్తారు. లావు అనేది ఒక పెద్ద సమస్య, అది మనిషిని సైకలాజికల్ గా ఎంత కృంగదీస్తుందో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి నో బాడీ షేమింగ్.

3.ఆంటీ అనే పిలుపు, కేవలం పెళ్లైనంత మాత్రానా ఆంటి అయిపోతారా? ఆంటీ ఆంటీ అంటూ స్నేహితులు, చుట్టాలు ఆటపట్టించడం కామన్ . కాని ఆ మాటలు మెంటల్ గా బాగా డిస్టర్బ్ చేస్తాయి.
4. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలా పెళ్ళి కుదిరిందో లేదో, లేదంటే పెళ్లయిందో లేదో వెంటనే వచ్చే ప్రశ్న పిల్లల కోసం ప్లాన్స్ ఏం చేయట్లేదా? ఎన్నో కలలతో అత్తింట్లో అడుగుపెట్టే అమ్మాయికి భర్తతో, తన ఫ్యామిలితో మింగిల్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. వెంటనే పిల్లలు అంటే ,తాను కేవలం పిల్లల్ని కనే మెషీన్నా అనే నెగటివ్ ఆలోచనలకి మనమే బీజం వేసినవారమవుతాం.

5.పెళ్లి అన్నాక వరుడి తరపు వారు మర్యాదల్లో లోటు జరిగిందని, కోపతాపలు సహజం. కాని వీలైనంత వరకు ఈ గొడవల్ని పెళ్లి కూతురి దృష్టి కి తీసుకురాకపోవడం మంచిది.
6.పెళ్లి చేసుకునేది సంతోషంగా బతకడానికి, అలాంటి పెళ్లిలో భర్తతో గొడవపడకు, దేనికైనా సర్దుకుపోవాలి అని చెప్తుంటారు. పిల్లకి మంచి చెప్తున్నాం అనుకుంటారు చాలామంది. కాబట్టి పెళ్లయ్యక గొడవలుంటాయి అనే లేని భయాల్ని క్రియేట్ చేయకుండా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి.


End of Article

You may also like