Ads
అమ్మాయిపై ప్రేమ పుట్టుకొచ్చో, లేక బాగా ఫ్లర్ట్ చెయ్యాలనో ఏదో ఒక రకంగా తన వాట్స్ ఆప్ నంబర్ రాబట్టి… మెసేజులు చేస్తుంటారు. ఇంకొందరు డైరెక్ట్ గా లవ్ సింబల్, అదే హార్ట్ ఈమోజి పంపిస్తుంటారు. అది కొంత మంది అమ్మాయిలకు నచ్చుతుంది.
Video Advertisement
కొందరికి నచ్చదు. అయినా సరే అదే పనిగా పంపిస్తే కొందరు బ్లాక్ చేస్తారు కానీ, కొన్ని దేశాల్లో జైలు శిక్ష విధిస్తారు. ఏంటి జైలు శిక్షా!! అని ఖంగు తిన్నారా? అవును నిజంగానే జైలు శిక్ష విధిస్తారంట, దాంతో పాటు భారీ జరిమానా కూడా విధిస్తారు.
ప్రజలకు సాధారణంగా కొన్ని చట్టాలు మాత్రమే తెలుసు. కొన్ని పనులకు తీవ్రమైన చట్టాలు ఉంటాయని తెలియక, కొన్ని పొరపాట్లు చేస్తుంటారు.అయితే కొన్ని దేశాల్లో అమ్మాయిలకు హార్ట్ ఈమోజి పంపిస్తే అది చట్ట వ్యతిరేకం అన్నమాట. కువైట్, సౌదీ అరేబియా వంటి ప్రాంతాల్లో అమ్మాయిల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, వారికి ఇబ్బంది కలిగేలా చేసినా చాలా కఠినంగా శిక్షిస్తారు. అక్కడ రూల్స్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇక అమ్మాయికి వాట్స్ ఆప్ లో లవ్ ఈమోజి పంపినా కూడా ఊరుకునేది లేదన్నట్టు కొన్ని రూల్స్ తీసుకొచ్చింది.
అలా చేస్తే గనుక చట్ట ప్రకారం నేరంగా పరిగణించి… రెండేళ్ల జైలు శిక్ష, 2000 రూపాయల కువైట్ దినార్ల, అంటే ఇండియా ప్రకారం 5,35,825 జరిమానా విధస్తారు. అదే సౌదీ అరేబియా లో అయితే రెండు నుంచి అయిదేళ్ల జైలు శిక్షతో పాటు 1,00,000 సౌదీ రియాలు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 22,04,197 రూపాయల జరిమానా విధిస్తారు. అమ్మాయిలు తమ వాట్స్ ఆప్ లో వచ్చే లవ్ ఈమోజీల పై కంప్లెయింట్ ఇస్తే గనుక వాటిని హరాస్మెంట్ కేస్ కింద ఫైల్ చేస్తారు. ఇక ఈ విషయాలను కువైట్, ఇంకా సౌదీ అరేబియా దేశాలు ఇటీవల మీడియాల ద్వారా వెల్లడించారు.
అయితే సౌదీలో అయితే ఒకవేళ మళ్లీ మళ్లీ ఇదే తప్పు రిపీట్ చేస్తూ 3,00,000 రియాలు జరిమానా అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం 66,11,664 రూపాయల జరిమానా విధించి కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష వేస్తారు. ఇది చూసి నెటిజన్లు ఇదెక్కడి దారుణం, అయినా అమ్మాయిలకేనా అబ్బాయిలకు లేవా ఇలాంటి చట్టాలు అంటూ కామెట్లు చేస్తున్నారు. దేవుడా మనం ఆ దేశాల్లో లేము కాబట్టి బతికి పోయామని మరికొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
End of Article