చాణుక్యుడు భారతీయులందరికి సుపరిచుతుడే. అర్ధశాస్త్రాన్ని ఔపోసన పట్టి, సకల రాజనీతి జ్ఞానాన్ని సముపార్జించిన వాడు చాణుక్యుడు. అర్ధశాస్త్రాన్ని రచించింది ఈయనే అని మనకి తెలిసినదే. ఈయన రచయితా గా, సలహాదారుని గా ఎనలేని ఖ్యాతి గడించారు. ఈయన చెప్పిన నీతి వాక్యాలు నేటికీ చిరస్మరణీయాలు. ఈయన చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఆచరించుకుని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం.

chanakya nithi

#1. చాణుక్యుడు చెప్పిన నీతి సూత్రాల ప్రకారం.. పురుషుడు ఆర్ధిక పరం గా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవ్వరికి చెప్పకూడదట. ఒకవేళ చెబితే, ఆ వ్యక్తికీ ఇతరులెవ్వరు సాయం చెయ్యరట. ఒకవేళ ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వచ్చినా అది అబద్ధమేనట. మనస్పూర్తి గా ఎవరు సాయం చేయరట.

#2. అలాగే, వ్యక్తిగత సమస్యల గురించి కూడా ఎవ్వరికి చెప్పకూడదట. ఎందుకంటే అర్ధం చేసుకునే వారికంటే.. అపహాస్యం చేసే వారే ఎక్కువమంది ఉంటారట. దీనివలన ఆత్మనూన్యతా భావాలు ఎక్కువ అవుతాయట. కాబట్టి మన బలహీనతల గురించి ఇతరులకు చెప్పకపోవడమే మంచిది.

sharing secrets

#3. ఇంకా చాణుక్యుడు ఏమి చెప్పాడంటే.. ఏ పురుషుడు అయినా తన భార్య రహస్యాలను ఇతరులతో పంచుకోకూడదట. దానివల్ల భవిష్యత్ లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భార్య గురించి రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి.

#4. అలాగే ఎవరైనా ఎప్పుడైనా అవమానానికి గురి అయినా.. ఆ విషయాన్నీ అక్కడితో వదిలేయాలట. అది ఎవరితో అయినా పంచుకున్నా వారు దానిని హాస్యమాడితే మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీని వలన మరింత బాధ ఎక్కువ అవుతుంది. కాబట్టి, మనకు జరిగిన అవమానాలను ఎవరితోనూ పంచుకోకపోవడమే ఉత్తమం.