“Daily an apple keeps a doctor away” అనేది ఇంగ్లీష్ సామెత. అంటే.. రోజు ఒక ఆపిల్ ను తింటే డాక్టర్ ను దూరం గా ఉంచొచ్చట. అంటే.. ఆరోగ్యవంతం గా ఉంటాము. అస్తమానం వైద్యుని వద్దకు వెళ్లాల్సిన అవసరం రాదని అర్ధం. అయితే.. ఆపిల్ పండు మాత్రమే కాదు.. తొక్క కూడా బాగా ఉపయోగపడుతుందట.
చాలా మంది ఆపిల్ పండుని డైరెక్ట్ గా తినేస్తూ ఉంటారు. కానీ కొంతమంది పెద్దవాళ్ళు, దగ్గు వంటి సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం ఆపిల్ ను తొక్క తీసి తింటూ ఉంటారు. అయితే.. ఈ తొక్కని మాత్రం పడేయకండి.
యాపిల్ తొక్కల వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఇంకెప్పుడూ వాటిని బయటపడేయ్యరు. చర్మ సమస్యలతో ఇబ్బంది పడే వారికి ముఖ్యంగా వేసవి కాలంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. యాపిల్ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతే కాదు.. ఇందులో ఉండే విటమిన్ కే, విటమిన్ ఈ లు చర్మ రక్షణకు దోహదం చేస్తాయి. వేసవి కాలంలో చర్మంలో తేమ తక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మం నిగారింపుని కోల్పోయి ఎండిపోయినట్లు అయిపోతుంది. అందుకే చర్మం పొడిబారకుండా ఉండడానికి యాపిల్ తొక్కలు ఎంతగానో దోహదం చేస్తాయి.
యాపిల్ తొక్కలతో పాటు టమాటో ను కలిపి గ్రైండ్ చేసుకుని దానికి కొంచం పెరుగుని కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి కొంతసేపటి తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడగాలి. వారంలో మూడు రోజులు ఇలా చేయడం వలన చర్మం మెరుస్తుంది. ముఖం కళగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఆపిల్ తొక్కలతో చేసిన పొడిలో ఫ్రెష్ బట్టర్ వేసి ముఖానికి, మెడకి అప్లై చేయాలి. ఇలా చేస్తే ఎక్కడ అయినా నల్లని మచ్చలు ఉంటె అవి తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ ను కూడా వారానికి మూడు సార్లు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వలన ముఖం నిర్జీవంగా కాకుండా కళగా కనిపిస్తూ ఉంటుంది.