Ads
ఇటీవల స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన తరువాత అందరు ఆలస్యం గా నిద్రలోకి జారుకుంటున్నారు. అసలు ఫోన్ చూడడం వల్లనే మనకు తొందరగా నిద్ర పట్టదు. ఫలితం గా ఆలస్యం గా నిద్ర లేస్తాం. చాలా మంది నిద్ర పట్టక టివి చూడడం, ఫోన్ చూడడం, లేదా అస్తమానం లేచి మంచినీరు తాగడమో, పాలు తాగడమో చేస్తుంటారు. లేదంటే ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారు.
Video Advertisement
కానీ వీటివలన అన్ని సార్లు నిద్ర పట్టకపోవచ్చు. కొంత మందికి పడుకునే ముందు పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. ఇలా పడుకునే ముందు పుస్తకాలు చదవడం చాలా మంచి అలవాటు. ఒక అరగంట సేపు చదవగానే మంచి నిద్ర పడుతుంది. పుస్తకాలు చదివే అలవాటు లేని వారు నిద్ర పట్టకపోతే.. మీ చేతి లో ఉన్న ఫోన్ ను పక్కన పెట్టేసి, వెల్లకిలా పడుకోడానికి ప్రయత్నించండి. పక్కలకు తిరిగి పడుకోవడం కంటే.. వెల్లకిలా పడుకోవడం వలన హాయిగా నిద్ర పడుతుంది.
వెల్లకిలా పడుకుని, గుండెల మీద చేయి వేసుకుని కన్నులు మూసుకోండి. ప్రశాంతమైన ఆలోచనలతో పడుకోడానికి ప్రయత్నించండి. మీకు దేవునిపై నమ్మకం ఉంటె.. ఆ సమయం లో ఓ నమః శివాయ అనో, నమో నారాయణాయ అనో, శ్రీ మాత్రే నమః అనో నామ జపం చేయండి.. పావుగంట లో మీకు నిద్ర పట్టేస్తుంది. ఒక వేళ మీకు నిద్ర పెట్టకపోయినా.. మీరు కేవలం గంట సేపు మాత్రమే పడుకున్నా.. మరుసటి రోజుకు మీకు ఎలాంటి అలసటా ఉండదు.
రోజూ ఎన్ని గంటలు పడుకుంటారో.. అంతటి ఎనర్జీ నే మీరు వెల్లకిలా పడుకుని, కనులు మూసుకుని ఉండడం వలన లభిస్తుంది. నిద్ర పట్టకపోవడం గురించి ఓ కవి చమత్కారం గా ఇలా రాశారట. ఒకసారి.. నిద్రా దేవి బ్రహ్మ దేవుడిని ఇలా అడుగుతుందట.. ఎలాంటి వారు తొందరగా నిద్రపోతారు..? ఎలాంటి వారితో అయితే తన పని సులువు అవుతుంది అని అడిగిందట. దానికి బ్రహ్మ దేవుడు ఏమని సమాధానం ఇచ్చాడో.. కవి చమత్కారం గా చెప్పాడట.
దొంగ దగ్గరకి, పేకాట ఆడే వాడి దగ్గరకి, పరస్త్రీ పై వ్యామోహం ఉన్న వాడి వద్దకు వెళ్లవద్దని బ్రహ్మ దేవుడు సూచించాడట. దొంగ రాత్రి సమయం లోనే పని చేస్తాడు కాబట్టి పడుకోడు, పేకాట ఆడేవాడు ఆట కు ఆట తెల్లవార్లూ ఆడుతూనే ఉంటాడు తప్ప పడుకోడు. ఇక పరస్త్రీ పై వ్యామోహం కలిగిన వారు కూడా ఊహల్లో తేలుతూనే ఉంటారు తప్ప పడుకోడు కాబట్టి.. వీరి వద్దకు వెళ్లవద్దని బ్రహ్మ చెప్పాడట.
మరి.. ఎటువంటి వారి దగ్గరకు వెళ్ళాలి అని అడిగితె.. పెళ్లి అయిన పదేళ్ల తరువాత భార్య పక్కనే పడుకునే వారు, పుస్తకం చదువుతున్నవారు, మంత్రం జపం చేసుకుంటున్న వారు అయితే.. పడుకున్న కాసేపటికే నిద్రపోతారని.. అలాంటి వారి వద్దకు వెళితే వారికి త్వరగా నిద్ర వచ్చేట్లు చేయచ్చని బ్రహ్మ సలహా ఇచ్చాడట. నిజం గా మంత్ర జపం చేసుకుంటూ పడుకోవడం వలన మొదట్లో ప్రశాంతం గా నిద్రపడుతుంది. మంత్ర జపం లోని శక్తి ఒంటబట్టిన వారికి నిద్ర పోకపోయినా కూడా ప్రశాంతం గా నిర్మలం గా ఉండగలుగుతారు. మంత్ర జపానికి అంతటి శక్తి ఉంటుంది.
End of Article