Ads
భారత దేశం సర్వ మతాలకు, సర్వ సంప్రదాయాలకు నిలయం. ఇక్కడ హెచ్చు సంఖ్యలో హిందువులు ఉంటారు. హైందవ ధర్మం, సంప్రదాయాలు, ఆచారాలు కూడా ఇక్కడ ఎక్కువ గానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆచరించబడే ప్రతి ధర్మానికి శాస్త్రీయం గా ఒక ప్రయోజనం ఉంటుంది. పెద్దలు ఎందుకు చెప్పారో.. అవి సదా ఆచరణీయాలే.
Video Advertisement
ఈ అలవాట్లు, కట్టుబాట్ల ప్రయోజనాలు ప్రస్తుతానికి పూర్తి గా తెలియకపోయినప్పటికీ, కాలక్రమం లో వాటి అవసరం తెలిసొస్తూ ఉంటుంది. ఇప్పటికే కొన్ని అలవాట్ల వెనుక ఉన్న ఉపయోగాలు తెలిసొచ్చాక పాశ్చాత్య దేశాలు సైతం భారతీయ సనాతన ధర్మ అలవాట్లను, సంప్రదాయాలను ఆచరించడానికి ఇష్టపడుతున్నారు. కొందరైతే, ఏకం గా విదేశాల్లోని జీవితాలను వదిలేసి.. ఇక్కడ జీవించడానికే ఇష్టపడుతున్నారు. ఇక్కడ జీవితాలలో జీవం ఉంటుంది. యాంత్రికత ఉండదు. కానీ, క్రమేపీ భారతీయుల్లో కూడా పాశ్చాత్య పోకడలు కనపడుతున్నాయి.
వృత్తిరీత్యా కావచ్చు, అవసరాల రీత్యా కావచ్చు.. భారతీయులకు ఉన్న అలవాట్ల స్థానం లో పాశ్చాత్య అవసరలొచ్చి చేరుతున్నాయి. అందుకే ఉదాహరణే ఇది. గతం లో భారతీయులు తలస్నానం చేయడానికి కుంకుడు కాయలను వినియోగించేవారు. కుంకుడు కాయలను కొట్టి, గింజలు తీసేసి, నీటిలో నానబెట్టి రసం పిండి..ఆ రసం తో తలస్నానం చేసేవారు. దానివలన చుండ్రు, జుట్టు రాలడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు గతం లో ఉండేవి కాదు. అయితే, క్రమం గా కుంకుడు కాయలను వినియోగించడం మానేసి.. షాంపూలు వినియోగిస్తున్నారు.
వాడడానికి తేలికగా ఉండడం తో అందరు వీటినే ఉపయోగిస్తున్నారు. దీనితో.. ప్రస్తుతం అందరు జుట్టు సమస్యలతో ఎలా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తూనే వున్నాం. కానీ, విదేశీయులు మాత్రం మన కుంకుడు కాయలను కళ్ళకద్దుకుని వాడుకుంటున్నారు. మన మంచి అలవాట్లని గాలికొదిలేసి.. విదేశీయుల సాంపులను మనం వాడుతుంటే.. వారు మన సంప్రదాయాలను, అలవాట్లను పాటిస్తూ ఆనందం గా ఉంటున్నారు. ఈ కుంకుడు కాయలను డ్రైడ్ సోప్ బెర్రీస్ పేరిట అమెరికన్ సూపర్ మార్కెట్ లో అమ్ముతున్నారు. వాటికి అక్కడ గిరాకీ కూడా ఎక్కువే. మనం మాత్రం వీటిని పక్కన పెట్టేసాం. అందుకే అంటుంటారు పొరుగింటి పుల్ల కూర రుచి అని.
End of Article