Ads
సాధారణం గా వాస్తు గురించి ఏ కొద్దీ నాలెడ్జి ఉన్నవారు అయినా.. వీధి పోటు గురించి చెప్పగలుగుతారు. వీధిపోటు అనగానే.. అది ఉన్న ఇంట్లో ఉండడం మంచిది కాదని అందరు టక్కున చెప్పేస్తూ ఉంటారు. ఇంతకీ వీధి పోటు ఉంటె మంచిదా..? లేక నష్టం వస్తుందా..? అసలు వీధిపోటు అంటే ఏమిటి అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Video Advertisement
సాధారణం గా వీధి మన ఇంటి ఎదురు వరకు వచ్చి ఆగిపోయినా.. లేదా అక్కడనుంచి మలుపు తీసుకున్నా.. దానిని వీధిపోటు గా పేర్కొంటారు. ఈ వీధిపోట్లలో కొన్ని గృహస్తులకు మేలు చేసేవి ఉంటాయి. కొన్ని కీడు చేస్తూ ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇంటికి తూర్పు, ఈశాన్య భాగాల్లో వీధి పోటు వస్తే.. దానివలన గృహస్తు కి మంచి జరుగుతుంది. ఆ ఇంట్లో నివసించే పురుషులకు సర్వాధికారాలు లభిస్తాయి. ఏ రంగం లో అడుగుపెట్టినా విజయం వీరి సొంతం అవుతుంది. ఆత్మవిశ్వాసం తో పని చేయగలుగుతారు.
ఇంటికి ఉత్తర – ఈశాన్య దిక్కు వైపు వీధిపోటు ఉంటె.. ఆ ఇంట్లో స్త్రీలకూ మేలు జరుగుతుంది. ఆ ఇంటి యజమానికి ఆదాయం బాగా ఉండి మానసికం గా ప్రశాంతం గా ఉండగలుగుతారు. అలాగే.. ఇంటికి పశ్చిమ-వాయువ్య భాగం వైపు వీధి ఉంటె ఆ ఇంటి గృహస్తు కి సమాజం లో గౌరవ మర్యాదలు కలుగుతాయి. వారికి రాజకీయ రంగం కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే.. దక్షిణ – ఆగ్నేయ భాగం వైపు వీధి ఉంటె ఆ ఇంటిల్లిపాది సుఖం గా ఉంటారు. శుభకార్యాలు నిర్వహిస్తూ.. బంధువుల ఆదరణను చూరగొంటారు. వీరికి అనుకోని ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది.
అలానే, కొన్ని వీధిపోట్లు అస్సలు అచ్చిరావు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉత్తర వాయువ్య భాగం లో వీధిపోటు రావడం వలన ఆ ఇంట్లో స్త్రీలకు చెడు ఫలితాలు ఉంటాయి. పెళ్లి కుదరకపోవడం, కుదిరిన సంబంధాలు చెడిపోవడం వంటివి జరుగుతుంటాయి. పశ్చిమ – నైరుతి భాగం వైపు వీధిపోటు ఉండడం వలన కూడా అనేక నష్టాలూ సంభవిస్తూ ఉంటాయి. డబ్బు చేయి దాకా వచ్చి చేజారిపోతుంటుంది. దక్షిణ-నైరుతి భాగం లో వీధిపోటు ఉండడం కూడా మంచిది కాదు. స్త్రీలకు ఆరోగ్యం చెడిపోవడం, దంపతుల మధ్య తగాదాలు రావడం వంటివి జరుగుతుంటాయి.
అలాగే, ఇంటికి తూర్పు – ఆగ్నేయం వైపు వీధిపోటు ఉండడం కూడా కష్టాలను కొని తెస్తుంది. సంపాదించినా సొమ్మంతా ఇంటికి రాకుండానే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కుటుంబ కలహాలు ఎక్కువ అవుతాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఇంటి ఎదురు గా ఉండే వీధి పెద్ద రోడ్డు తో ఉంటె దోష ప్రభావం పెద్దగా ఉండదని చెబుతుంటారు. ఉత్తరం, ఈశాన్యం లలో ఎక్కువ గా ఖాళీ ప్రదేశం ఉంటుంది కాబట్టి పెద్దగా నష్టాలు రావు. దక్షిణం,నైరుతి వీధిపోట్ల విషయం వచ్చేసరికి.. ఇంటికి ఎదురుగా ఉండే వీధి నుంచి ఏదైనా వాహనం వచ్చి గుద్దితే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ. అందుకే పెద్దలు ఇలా చెప్పారు. వీటిని తెల్సుకుని పాటించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
End of Article