వాష్ బేసిన్ లో ట్యాప్ కింద ఆ “హోల్” ఎందుకుంటుందో తెలుసా? షో కోసం కాదు…కారణం ఇదే.!

వాష్ బేసిన్ లో ట్యాప్ కింద ఆ “హోల్” ఎందుకుంటుందో తెలుసా? షో కోసం కాదు…కారణం ఇదే.!

by Anudeep

Ads

ఉదయం సింక్ క్లీన్ చేసేప్పుడు సింక్ వాల్ కి ఒకవైపు ట్యాప్ కిందుగా ఒక హోల్ కనపడింది.. ప్రతిరోజు సింక్ యూజ్ చేసేటప్పుడు ఆ హోల్ ని చూడడం, వాటర్ పోవడానికి ఒక హోల్ ఉంది.. మళ్లీ ప్రత్యేకంగా ఇక్కడ ఈ హోల్ ఎందుకుంది అనే డౌట్ వచ్చేది..అదే విషయం తెలుసుకోవాలనిపించింది..ఆ హోల్ ఎందుకు అనే విషయాన్ని  సెర్చ్ చేస్తే  దీనివలన రెండు ఉపయోగాలున్నాయని తెలిసింది..అవేంటంటే..

Video Advertisement

1)మనం ఎప్పుడైనా పొరపాటున ట్యాప్ ఆఫ్ చేయడం మర్చిపోయామనుకోండి.. ఇంతలో డ్రైనేజ్ వాటర్ వెళ్లే హోల్ కూడా మూసుకుపోయినట్టైతే, అప్పుడు వాటర్ సింక్ నిండి ఇంటినిండా అవ్వకుండా , ఈ ఓపెనింగ్ హోల్ ద్వారా డ్రైనేజ్ లోకి వెళ్లిపోతాయి.

కావాలంటే మీరొకసారి మీ బాత్రూంలో ఉన్న సింక్ డ్రెయిన్ వాటర్ వెళ్లే దారిని మూసేసి, సింక్లో ఈ ఓపెనింగ్ హోల్ ఉన్నంత వరకు వాటర్ ని నింపండి..అప్పుడు వాటర్ సింక్ పూర్తిగా నిండిపోయి బయటకు రాకుండా , ఆ ఓపెనింగ్ హోల్ ద్వారా డ్రెయినేజి లోకి వెళ్లిపోవడాన్ని గమనించవచ్చు.. కానీ ఒక విషయం ఈ ఓవర్ ఫ్లో హోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి..కాబట్టి ఏదో కొంత సమయం వరకు ఇవి ఈ వాటర్ ని సింక్ నిండిపోయి బయటపడకుండా డైరెక్ట్ డ్రెయిన్లో కి వెళ్లే విధంగా చేయొచ్చు.

2) ఓవర్ఫ్లో (ఓపెనింగ్)ద్వారా డ్రెయిన్ వ్యవస్థలోకి గాలి ప్రవేశపెట్టబడి  సింక్ వేగంగా ప్రవహిస్తుంది..దీని వలన ఎటువంటి అడ్డంకులు లేకుండా వాటర్ డ్రైనేజ్ లోకి వెళ్లిపోతుంది.

సింక్ ఓవర్ఫ్లో  ఛానల్ ద్వారా డ్రెయిన్ పైపులోకి గాలిని అనుమతించడం ద్వారా బేసిన్ వేగంగా ప్రవహిస్తుంది. కాలువ ప్రారంభాన్ని పూర్తిగా కవర్ చేయడానికి బేసిన్లో తగినంత నీరు ఉన్నప్పుడు, కాలువ నీటి ద్వారా గాలిని పొందదు, ఇది చూషణ ప్రభావాన్ని సృష్టిస్తుంది, దీనివలన కాలువలోకి వెళ్ళే నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. కానీ కాలువ పైపుకు ఓవర్ఫ్లో ఫీడింగ్ గాలితో, చూషణ ప్రభావం తగ్గుతుంది మరియు నీరు చాలా వేగంగా పారుతుంది. దీనికి విరుద్ధంగా, ఓవర్‌ఫ్లో ఓపెనింగ్‌లు లేని సింక్‌లు సాధారణంగా నీరు వెళ్లేటప్పుడు  బుడగలు వస్తుంటాయి, మరియు చాలా నెమ్మదిగా వాటర్ అనేది సింక్ లో నుండి కాలువలోకి వెళ్లడాన్ని గమనించవచ్చు.

watch video:


End of Article

You may also like