Ads
గ్యాస్ సిలిండెర్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఇది మనకు నిత్యావసరాల్లో ముందుంటుంది. ఎందుకంటే వంట చేసుకోవడానికి ఎక్కువమంది గ్యాస్ పైనే ఆధారపడతాం కాబట్టి. మనం రెండు బండలు కొనుక్కుని ఒకటి స్పేర్ ఉంచుకుంటాం. ఒకటి అయిపోగానే మార్చుకుని.. రెండవ బండ బుక్ చేసుకుంటూ ఉంటాం. ఇది అందరు సహజం గా చేసే పనే.
Video Advertisement
బండ మనం సొంతం గా కొనుక్కున్నా.. అది మన దగ్గర ఉండదు. ఒకదాని బదులు మారుతూనే ఉంటుంది. అయినా సరే మనం గ్యాస్ బండ పాడవకుండా కాపాడాల్సి ఉంటుంది. అందుకోసమే ఆ గ్యాస్ బండ కు కింద మూడు చోట్ల హోల్స్ ఉంటాయి. అర్ధం కాలేదా..? గ్యాస్ బండ కు కింద ఉన్న భాగం నేలకు టచ్ అవ్వదు. అలా అవ్వకుండా చుట్టూ ఒక రింగ్ లాంటిది ఉంటుంది.
ఈ రింగ్ కే హోల్స్ పెట్టబడి ఉంటాయి. అలా బండ అడుగుభాగానికి, నేలకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ లో ఎల్లప్పుడూ ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉండాలి. ఒకవేళ గాలి ప్రసరించకపోతే.. తేమ కారణం గా బండకు తుప్పు పట్టేస్తుంది. ఇలా జరగకుండా ఉండడం కోసమే ఈ హోల్స్ ను ఏర్పాటు చేసారు. ఎప్పుడైనా బండ కింద కు నీరు చేరినా, ఈ హోల్స్ ఉండడం వలన ఎయిర్ పాస్ అవుతూ ఉండి నీరు ఆరిపోతాయి. లేదంటే బండ అడుగు భాగం పాడయ్యే అవకాశం ఉంటుంది.
బండ పాడయితే గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు జరగొచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసమే.. బండ కింద ఉండే రింగ్ లాంటి భాగానికి హోల్స్ పెట్టబడ్డాయి. ఈ హోల్స్ లో నుంచి నిరంతరం గాలి లోపలకి, బయటకి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు బండ పాడవకుండా ఉంటుంది.
End of Article