వంతెన పై రైలు వెళ్తున్నపుడు.. ఇలా మన దగ్గరే జరుగుతుంది అనుకుంట..?

వంతెన పై రైలు వెళ్తున్నపుడు.. ఇలా మన దగ్గరే జరుగుతుంది అనుకుంట..?

by Anudeep

Ads

కొన్ని కొన్ని సంఘటనలు చూసి మనం నవ్వుకుంటూ ఉంటాం.. కానీ, వాటి వెనుక ఉండే కారణాలను కూడా తెలుసుకోవాలి. కొన్ని నవ్వు తెప్పించినా.. అందులో ఎంతో కొంత వాస్తవం కూడా ఉంటుంది. అయితే.. ఈ కింది ఫోటో లో చూడండి.. పైన వంతెన పై ట్రైన్ వెళ్తోంది కదా. ఆ వంతెన కింద.. అండర్ పాస్ లో ప్రయాణీకులు వెళ్లకుండా ట్రైన్ వెళ్లే వరకు అక్కడే కదలకుండా వేచి ఉంటున్నారు.

Video Advertisement

trains 2

వీరు ఇలా ఎందుకు ఉంటున్నారు..? ఇది భారత్ లోనే జరిగి ఉండొచ్చు. ముఖ్యంగా నగరాలు మరియు పట్టణాల్లోని రైల్వే అండర్‌పాస్‌ల (సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ మౌలిక సదుపాయాలు లేవు) వద్ద ఇది జరిగి ఉండవచ్చు. ఈ ఫోటో ను చూస్తే రైలు ప్రయాణిస్తున్నప్పుడు వాహనాలు (ముఖ్యంగా 2 మరియు 3 వీలర్లు) మరియు పాదచారులు వంతెన నుండి కొన్ని మీటర్ల దూరంలో ఎందుకు వేచి ఉన్నారు అన్న అనుమానం రాక మానదు.

trains 1

ఎందుకంటే, వంతెన పైన రైలు వెళుతున్నప్పుడు రైలు లో ఉన్న వ్యక్తులు తాము ఉన్న ప్రదేశాన్ని చూడకుండా వ్యర్ధాలను విసిరి వేయవచ్చు. మరో వైపు రైలు లో ఉంటె మల మూత్ర విసర్జన శాలల నుంచి వ్యర్ధాలు కిందకి పడుతూ ఉంటాయి. పైన రైలు కదులుతున్న సమయం లో వంతెన కింద ప్రయాణించడం వలన ఆ వ్యర్ధాలు కింద ప్రయాణిస్తున్న వ్యక్తులపై పడే అవకాశం ఉంటుంది. అందుకే, ముందు జాగ్రత్త చర్య గా వారు రైలు వెళ్లే వరకు వేచి ఉంటున్నారు.


End of Article

You may also like