రైలు భోగి పై ఉండే “LIFT HERE”, “SIDE FILLING” కి అర్థం ఏంటో తెలుసా.?

రైలు భోగి పై ఉండే “LIFT HERE”, “SIDE FILLING” కి అర్థం ఏంటో తెలుసా.?

by Anudeep

ట్రైన్ ప్రయాణం అనగానే.. అందరం ఒకరకమైన జోష్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎలాంటి ట్రాఫిక్ చికాకులు లేకుండా.. హాయిగా పీస్ ఫుల్ గా జర్నీ టైమ్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయగలిగేది ట్రైన్ లోనే కాబట్టి. అయితే.. రైల్వే శాఖ కూడా ప్రయాణికుల క్షేమం, సుఖం కోసం పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది.

Video Advertisement

train 1

మీరు ఇప్పటికి చాలా సార్లే ట్రైన్ లో ప్రయాణం చేసి ఉంటారు.. కానీ ఈ విషయాన్నీ ఎప్పుడైనా గమనించారా.? ట్రైన్ డోర్ కి రెండు వైపులా ఈ పదాలు రాసి ఉంటాయి. ఒక వైపు లిఫ్ట్ హియర్ అని రాసి ఉంటె మరొక వైపు సైడ్ ఫిల్లింగ్ అని రాసి ఉంటుంది. ఈ సారి ట్రైన్ ఎక్కినప్పుడు సరిగ్గా గమనించి చూడండి. ట్రైన్ లో ప్రతి బోగి పైనా డోర్ కు ఇరువైపులా ఇలా రాసి ఉంటుంది. అయితే.. ఇలా ఎందుకు రాస్తారు అన్న విషయం ఇప్పుడు చూద్దాం.

train 2

ట్రైన్ ను మెయింటెనెన్స్ కు తీసుకువెళ్ళేటప్పుడు ప్రతి బోగీని సెపరేట్ చేస్తారు. ఆ సమయం లో బోగీని ఒక క్రేన్ సహాయంతో పైకి లేపుతారు. అయితే.. ఎక్కడ పడితే అక్కడ క్రేన్ ను పెట్టి పైకి లేపితే డామేజ్అయ్యే అవకాశం ఉంది కాబట్టి పర్టికులర్ ప్లేస్ లోనే పెట్టి పైకి లేపుతారు. ఆ ప్లేస్ ఎక్కడో తెలియడం కోసం “లిఫ్ట్ హియర్” అని రాస్తారు. అలాగే.. ట్రైన్ లో నిత్యం నీటి అవసరం ఉంటుంది.

train 3

వాష్ రూమ్స్, వాష్ బేసిన్స్ లో నీరు అవసరం అవుతుంది కాబట్టి ట్రైన్ లో ఉండే ట్యాంక్స్ లో వాటర్ ను ఫిల్ చేస్తారు. ప్రతి ట్రైన్ లో నాలుగు ట్యాంక్స్ ఉంటాయి. ఒక్కో టాంకర్ లో ఐదువందల లీటర్ల నీటిని నింపవచ్చు. అంటే ఒక ట్రైన్ లో రెండు వేల లీటర్ల నీటిని నింపుతారు. అయితే ఈ వాటర్ ను ఫిల్ చేసే చోట.. గుర్తు తెలియడం కోసం “సైడ్ ఫిల్లింగ్” అనే పేరుని రాస్తారు.


You may also like