Ads
మనం రోడ్డు పై వెళుతున్నప్పుడు ముందు, వెనక చూసుకుని నడుస్తుంటాం.. అలాగే, జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రమే రోడ్డు దాటుతాము. అలాగే, వాహనాలు ఎంత వేగం గా వెళుతున్నా, జీబ్రా క్రాసింగ్ దగ్గర మాత్రం స్లో గా వెళ్ళవలసి ఉంటుంది. రోడ్డు పై నడుచుకుంటూ వెళ్లేవారు రోడ్డు దాటడం కోసం ఈ క్రాసింగ్ ను ఏర్పాటు చేసారు. అలాగే, ఇవే కాకుండా మెయిన్ రోడ్డు పైనా, హై వే ల పైనా పసుపు, తెలుపు రంగులతో నిలువు గీతాలను ఎప్పుడన్నా గమనించారా..? అవి ఎందుకు ఉంటాయి అని ఎప్పుడైనా ఆలోచించారా..?ఈ గీతలు ఎందుకు గీస్తారో తెలుసుకుని, వాటికి అనుగుణం గా నడుచుకుంటూ వెళితే ఎన్నో రోడ్డు ప్రమాదాలను మనం నివారించొచ్చు.
Video Advertisement
తెలుపు రంగు గీత మందం గా ఒక్క గీతే:
ఎప్పుడైనా సరే.. రోడ్డు పైనా తెలుపు రంగు గీత మందం గా ఒక్క గీతే ఉన్నపుడు ఆ రోడ్డు పై మనకు కేటాయించిన లైన్ లోనే వెళ్లాలని అర్ధం. మన పక్కన ఉన్న లైన్ లోకి ఓవర్ టేక్ చేయడం కోసం మనం వెళ్ళకూడదు. అటు వైపు నుంచి వచ్చే వారు సడన్ గా వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అందుకే అటు వైపు వెళ్లొద్దు అని చెప్పడానికి ఈ గుర్తు ను వాడతారు.
తెలుపు రంగు గీత అక్కడక్కడా బ్రేకులతో:
అదే తెలుపు రంగు గీత అక్కడక్కడా బ్రేకులతో ఉంటె రోడ్డు పై వెళ్లే వాహనదారులు లైన్లను చేంజ్ అవ్వొచ్చని అర్ధం. అయితే, లైన్ చేంజ్ అయ్యేటపుడు ముందు వెనక చూసుకుని చేంజ్ అవ్వాల్సి ఉంటుంది.
ధృడమైన పసుపు రంగు గీత:
అలాగే, ఏదైనా రహదారి పైనా మధ్య లో ధృడమైన పసుపు రంగు గీత ఉంటె మీరు మీ ముందు వెళ్లే వాహనాలను ఓవర్ టేక్ చేయవచ్చని అర్ధం. అయితే, మధ్యలో ఉన్న పసుపు రంగు గీతను దాటి పక్క లైన్ లోకి వెళ్ళకూడదు. మీరు ఉన్న లైన్ లోనే మీ ముందు ఉన్న వాహనాలను ఓవర్ టేక్ చేయవచ్చు. కానీ, కొన్ని రాష్ట్రాలలో ఈ గీతకు అర్ధం వేరు గా ఉంటుంది. ఇదే విధం గా పసుపు రంగు గీత మధ్య లో ఉంటె, తెలంగాణ రాష్ట్రం లో మీరు ఓవర్ టేక్ చేయకూడదు. దేశం లో ఎక్కడైనా దృఢం గా ఉన్న పసుపు గీతలు రెండు ఉంటె.. ఆ రహదారిలో ఓవర్ టేక్ చేయడం నిషేధించబడినదని అర్ధం.
పసుపు రంగు గీతకు మధ్యలో బ్రేక్స్:
అలాగే, ఈ పసుపు రంగు గీతకు మధ్యలో బ్రేక్స్ ఉంటె మీరు ఓవర్ టేక్ చేయవచ్చు. కానీ జాగ్రత్తలు పాటించాలని అర్ధం. అదండి సంగతి.. ఇలాంటి చిన్న విషయాలను తెలుసుకుని మీరు డ్రైవింగ్ చేసేటపుడు తగిన జాగ్రత్తలు పాటిస్తే ఎన్నో ప్రమాదాలను నివారించవచ్చు.
End of Article