లేడీస్ “జీన్స్” కి “జిప్” ఎందుకు ఉంటుందో తెలుసా.? తప్పుగా అనుకోకండి…వెనకున్న కారణం ఏంటో చూడండి.!

లేడీస్ “జీన్స్” కి “జిప్” ఎందుకు ఉంటుందో తెలుసా.? తప్పుగా అనుకోకండి…వెనకున్న కారణం ఏంటో చూడండి.!

by Anudeep

Ads

ఈరోజుల్లో ఆడ, మగా తేడా లేకుండా అందరు జీన్స్ ధరిస్తున్నారు. ఎక్కువ కాలం వీటిని సౌకర్యవంతం గా ధరించవచ్చు. అందుకే అబ్బాయిలైనా.. అమ్మాయిలైనా జీన్స్ ధరించడానికి ఎక్కువ గా ఆసక్తిని కనబరుస్తున్నారు. యువత మాత్రమే కాదు.. కొందరు పెద్దలు కూడా వీటిని ధరించడానికి మక్కువ చూపిస్తున్నారు.

Video Advertisement

ladies jeans 2

జీన్స్ పట్ల ఈ మోజు దాదాపు కొన్ని తరాల నుంచి వస్తూనే ఉంది.. ఎన్నో రకాల మోడల్స్ వస్తుండడం తో.. జీన్స్ ఎప్పుడు ఫ్యాషన్ ప్రపంచం లో ట్రేండింగ్ లో నిలుస్తూనే ఉంది. స్కిన్నీ జీన్స్, బేసిక్ జీన్స్, సిగరెట్ జీన్స్.. ఇలా రకరకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అయితే.. మోడల్స్ ఎన్ని రకాలుగా ఉన్నా అన్ని రకాల జీన్స్ కి కామన్ గా ఉండే పాయింట్ ఏమిటంటే.. వాటికి జిప్ ఉండడం.

ladies jeans

అబ్బాయిల జీన్స్ కి అయినా అమ్మాయిల జీన్స్ కి అయినా ఈ జిప్ మాత్రం కామన్ గానే ఉంటుంది. అబ్బాయిలకు మూత్ర విసర్జన కు అనువుగా ఉండడం కోసం జీన్స్ కీ ఫ్రంట్ సైడ్ జిప్ ను పెట్టి డిజైన్ చేసారు. మరి అమ్మాయిల జీన్స్ ని కూడా ఈ జిప్ ని ఎందుకు ఉంచారో తెలుసా..? అమ్మాయిల నడుము ప్రాంతం.. సహజం గానే అబ్బాయిల కంటే ఎక్కువ గా ఉంటుంది. అది అందరికి ఒకేలా ఉండదు. అందుకే అది సరిపోయేలా వేసుకోవడానికి జిప్ ను ఇస్తారు. అలాగే.. నడుము కు తగ్గట్లు టైట్ గా ఉంచుకునేందుకు బెల్ట్ పెట్టుకోవడానికి అనువుగా కూడా డిజైన్ చేసారు. ఇది చాలా చిన్నవిషయమే.. మనం రోజు చూస్తూ ఉండేదే.. కానీ.. మనం శ్రద్ధ పెట్టకపోవడం వలన ఇలాంటివి పట్టించుకోము.


End of Article

You may also like