మన దగ్గర “స్టీరింగ్” కుడివైపుకు అమెరికాలో ఎడమ వైపుకి ఎందుకుంటుంది?

మన దగ్గర “స్టీరింగ్” కుడివైపుకు అమెరికాలో ఎడమ వైపుకి ఎందుకుంటుంది?

by Anudeep

Ads

మనకి సినిమాలు చూసేటప్పుడు కొన్ని డవుట్స్ వస్తుంటాయి..వాటిల్లో కొన్ని సిల్లీగా ఉంటే..మరికొన్ని డౌట్స్ వలన కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది..కొన్ని హాలివుడ్ సినిమాలు చూసేటప్పుడు అందులో కార్స్ లేదంటే ఏ ఇతర వెహికిల్ డ్రైవ్ చేసినా వాటికి స్టీరింగ్ అనేది ఎడమ వైపు ఉంటుంది , అలాగే వెహికిల్స్ కూడా కుడి వైపునే వెళ్తుంటాయి..అదే మన ఇండియాలో అయితే స్టీరింగ్ కుడి వైపు ఉంటుంది..వెహికిల్స్ ఎడమ వైపునే వెళ్తుంటాయి..అసలు ఈ కుడి , ఎడమ అనేది ఎందుకొచ్చింది..దాని వెనుకఉన్న ఇంట్రస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసా..

Video Advertisement

ప్రస్తుతం అంటే ఇంత టెక్నాలజి అభివృద్ది చెంది రోజుకో రకం కారు, బైక్ ఇలా రకరకాల వాహనాలు మార్కెట్లోకి వస్తున్నాయి..కానీ ఇవేవి లేనప్పుడు గుర్రాలు , ఎద్దుల బండ్లే కదా వాడినది. అలా 1700వ సంవ‌త్స‌రంలో కేవ‌లం గుర్రాల‌ను మాత్ర‌మే ర‌వాణాకు ఉప‌యోగించేవారు. వాటిపై ఎక్కి దూరప్రాంతాలకు ప్ర‌యాణించేవారు.గుర్రాలపైకి ఎక్కాలంటే చాలామంది ఎడమవైపునుండే ఎక్కేవారు, ఎందుకంటే చాలామంది  కుడిచేతివాటం కలిగి ఉండడమే దానికి కారణం…

అంతేకాదు  అప్పట్లో క‌త్తులు ఎక్కువ‌గా వాడే వారు. వాటిని శరీరానికి ఎడమవైపు ఒరలో ఉంచుకునేవారు. గుర్రానికి కుడి వైపు నుంచి ఎక్కితే క‌త్తితో స‌మ‌స్య‌లు వ‌స్తాయి. కాబ‌ట్టి దానికి ఎడ‌మ వైపు నుంచే ఎక్కేవారు. అలా ఎక్కిన త‌రువాత కూడా ర‌హ‌దారిపై ఎడ‌మ వైపు నుంచే ప్ర‌యాణించ‌డం మొద‌లు పెట్టారు. అది అప్ప‌టి వారికి సౌక‌ర్యంగా ఉండేది. అనంత‌రం 1756, 1773 కాలం నాటికి గుర్ర‌పు బండ్లు రంగ ప్ర‌వేశం చేశాయి. అయితే అప్పుడు కూడా రోడ్డుపై ఎడ‌మ వైపునే ప్ర‌యాణించేవారు.

ఇదిలా ఉండగా అంత‌కు ముందు అనగా 1300వ సంవ‌త్స‌రంలో అప్ప‌టి పోప్ బోనిఫేస్ VIII ప్ర‌జ‌ల‌ను ర‌హ‌దారిపై ఎడ‌మ వైపునే ప్ర‌యాణించ‌మ‌ని చెప్పార‌ట‌. అలా కూడా గ్రీకులు, రోమ‌న్లు, ఈజిప్షియ‌న్లు ర‌హ‌దారిపై ఎడ‌మ వైపునే ప్ర‌యాణిస్తూ వ‌చ్చారు. కాగా 1756లో లండ‌న్ బ్రిడ్జిపై ర‌హ‌దారికి ఎడ‌మ వైపునే వెళ్లాల‌ని అప్ప‌టి ప్ర‌భుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆ పద్ధ‌తి సౌక‌ర్య‌వంతంగా ఉంద‌ని చెప్పి అక్క‌డ కూడా ర‌హ‌దారిపై ఎడ‌మ వైపునే ప్ర‌యాణించ‌డం మొద‌లు పెట్టారు.

కానీ అమెరికా వంటి కొన్ని దేశాల్లో మాత్రం ర‌హ‌దారిపై కుడి వైపు ప్ర‌యాణానికి ప్ర‌జ‌లు బాగా అల‌వాటు ప‌డ్డార‌ట‌. దీంతో 1915లో హెన్రీ ఫోర్డ్ త‌మ కార్లకు డ్రైవ‌ర్ సీట్‌ను ఎడ‌మ వైపు ఉంచాడ‌ట‌. ఈ క్ర‌మంలో అలాంటి కార్లు ర‌హ‌దారిపై కుడి వైపు ప్ర‌యాణానికి అనుకూలంగా ఉండేవి. రాను రాను అమెరిక‌న్ల ప‌ద్ధ‌తి బాగుంద‌ని చెప్పి అన్ని దేశాలు అదే త‌ర‌హా డ్రైవింగ్ సిస్ట‌మ్‌ను అనుస‌రిస్తూ వ‌స్తున్నాయి.

అయితే ఇండియాలో మాత్రం అందుకు భిన్నంగా ఇప్ప‌టికీ ర‌హ‌దారిపై ఎడ‌మ వైపునే వెళ్తున్నారు. ఎందుకంటే  మనల్ని పాలించిన బ్రిటిషర్ల‌ది అదే ప‌ద్ధ‌తి కాబ‌ట్టి, మన దేశంలో కూడా వారి పద్ధ‌తే అమ‌లులోకి వ‌చ్చింది.అమలు కాస్తా అలవాటుగా మారింది.. ఆ అలవాటుని మార్చడం కష్టం అయింది.. ఇదే సౌలభ్యంగా ఉండడంతో మన దేశంలో ఇదే ఫాలో అవుతున్నారు.. అదండీ లెఫ్ట్ రైట్ వెనుక కథ..


End of Article

You may also like