Ads
ఒక వ్యక్తి పై మనకి ఉండే ఇష్టాన్ని , ప్రేమని మనం చిన్న ముద్దు తో తెలియపరుస్తాం. కానీ.. మనం ఎప్పుడు ముద్దు పెట్టుకున్నా ఆటోమేటిక్ గా కళ్ళు మూసుకుంటాం.. ఇది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య లాగా జరిగిపోతూ ఉంటుంది. కావాలని మనం కళ్ళు మూసుకోకుండా ఉన్నా కూడా.. మనం ముద్దు పెట్టుకోవడం పై కాన్సన్ట్రేట్ చెయ్యలేం..ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.
Video Advertisement
ఇంగ్లీష్ లో ఒక సామెత ఏమిటంటే..” ఓ వ్యక్తి ముద్దు పెట్టుకుంటూ కూడా సేఫ్ గా డ్రైవింగ్ చేయగలిగాడు అంటే.. అతను ముద్దు పెట్టుకోవడం పై కాన్సన్ట్రేట్ చేయలేదని అర్ధం”. నిజమే… ఎందుకంటే, మనం ముద్దు పెట్టుకునేటపుడు వేరే ఏ ఇతర పనిని సరిగ్గా చేయలేము. ప్రేమని వ్యక్తపరిచేటపుడు.. ఆ విషయం పై దృష్టి నిలపడం కోసం మెదడు కూడా సహకరిస్తుంది. అందుకే ఆ సమయం లో మనం ఆటోమేటిక్ గా కళ్ళు మూసేసుకుంటాం. అలా చేస్తున్నపుడు.. మనం మనస్పూర్తి గా ముద్దు పెట్టగలుగుతాం. అందులోని ఫీల్ ని అనుభూతి చెందగలుగుతాం.
ఇలా అనుభూతి చెందే సమయం లో వేరే ఇతర పనులను చేయడం కష్ట సాధ్యమని మనస్తత్వ శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే తేల్చేసారు. నమ్మశక్యంగా లేదా..? ముద్దు పెట్టుకునేటపుడు మనం ఎందుకు కళ్ళు మూసుకుంటామో వివరించే ఈ ఆరు పాయింట్లను చదవండి.
#1. మీ భాగస్వామిని అంత దగ్గరగా చూడటం మీకు కష్టమవుతుంది, ఎందుకంటే సాధారణ మానవ కళ్ళు 25 సెం.మీ మధ్య ఎటువంటి ఒత్తిడి లేకుండా వస్తువులను చూడగలుగుతాయి. ముద్దు పెట్టుకునేటపుడు దగ్గిరగా ఉంటాము కాబట్టి చూడలేక కళ్ళు మూసుకుంటాము.
#2. ముద్దు పెట్టుకునే సమయం లో మీరు వారిని చూడడం కంటే.. ఆ ముద్దు తాలూకు అనుభూతిని పొందడం ఎక్కువ ఇష్టపడుతారు. అందుకే ఆ సమయం లో కళ్ళు మూసుకుంటారు.
#3. కళ్ళు మూసుకున్న సమయం లో మీ దృష్టి అంతా ముద్దు పైనే ఉంటుంది. ఇతర శబ్దాలను కూడా ఆ సమయం లో పట్టించుకోకుండా కేంద్రీకరించగలుగుతారు.
#4. కళ్ళు తెరిచి ఉంచినప్పుడు వేరే ఆలోచనలు వస్తుంటాయి. దీనివలన ముద్దు తాలూకు అనుభూతిని పొందలేరు.
#5. కళ్ళు మూసుకుని గంటల తరబడి ముద్దు పెట్టవచ్చు. కానీ ఒకసారి కళ్ళు తెరిచాక తొందరగా బాహ్య ప్రపంచం లోకి వచ్చేస్తారు. అనుభూతి చెందుతూ ముద్దు పెట్టాలంటే కళ్ళు మూసుకోవాల్సిందే.
#6. ఇది సరదాగా అనిపించినా నిజమే. మీ భాగస్వామి ముక్కు దగ్గరగా చూసినపుడు మరింత పెద్దది గా కనిపించడం వలన కూడా కళ్ళు మూసుకుంటారు.
End of Article