అక్కడ అబ్బాయిలందరు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి.. వింత గా ఉన్నా ఇది వారి ఆచారం.. ఎక్కడంటే..?

అక్కడ అబ్బాయిలందరు తప్పనిసరిగా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి.. వింత గా ఉన్నా ఇది వారి ఆచారం.. ఎక్కడంటే..?

by Anudeep

Ads

ఇప్పుడున్న కాలం లో ఒక పెళ్లి చేసుకోవడానికే ఇంటరెస్ట్ లేక కొందరు, అమ్మాయి దొరక్క మరికొందరు.. ఇలా చాలా మంది అబ్బాయిలు ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది ఆ ఊరిలో మాత్రం కచ్చితం గా రెండు పెళ్లిళ్లు చేసుకుంటారట. ఒకవేళ చేసుకోకపోయినా ఆ వ్యక్తి మొదటి భార్య దగ్గరుండి మరీ ఇంకొక అమ్మాయిని వెతికి పెళ్లి చేస్తుందట. అబ్బాయిలకి ఇంత అదృష్టం ఏ ఉళ్ళోనో అని ఆలోచిస్తున్నారా..? ఆ గ్రామం భారత్ లోనే ఉంది. రాజస్థాన్ లో దెరాసర్ గ్రామం లో ఈ ఆచారం ఉందట.

Video Advertisement

two wives per man 2

తెలుగు న్యూస్ కధనం ప్రకారం.. భారత్ లో రాజస్థాన్ రాష్ట్రము లో బార్మర్ జిల్లాలో దెరాసర్ గ్రామం లో గత కొన్ని దశాబ్దాలుగా ప్రతి అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం ఆనవాయితీ గా వస్తోందట. ఆ గ్రామం లో జనాభా అంత ఎక్కువేమీ కాదు. ఓ ఆరొందలమంది వరకు వుంటారు. అయినా సరే, ప్రతి అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు.. ఎందుకో తెలుసా …? పిల్లల కోసం. వారు మొదటి భార్య ను పెళ్లి చేసుకున్న తరువాత రెండవ పెళ్లి చేసుకోక పొతే పిల్లలు కలగరట. ఇదేదో కేవలం ఒకళ్ళకో, ఇద్దరికో జరిగేది కాదు. ఆ ఊరంతా ఇలాగె జరుగుతోందట.

ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత రెండవ పెళ్లి చేసుకోకుండా.. ఎంత కాలం ఎదురు చూసినా వారికి పిల్లలు కలగరట. అదే రెండో పెళ్లి చేసుకోగానే, రెండో భార్యకు సంతానం కలిగి.. ఆ తరువాత మొదటి భార్య కి కూడా సంతానం కలుగుతుందట. అందుకే అక్కడి వారు తప్పని సరిగా రెండవ పెళ్లి చేసుకుంటారట. మొదటి భార్యే దగ్గరుండి మరీ పిల్లని చూసి పెళ్లి చేస్తుందట. ఒకళ్ళో ఇద్దరో కాదు, ఆ ఊరి వారందరికీ ఇలానే జరుగుతోంది. అందుకే అక్కడ రెండు పెళ్లిళ్లు తప్పనిసరిగా చేసుకోవడం ఆనవాయితీ గా వస్తోంది. కొన్ని కొన్ని సంప్రదాయాలు అంతే. ఎంత వింతగా అనిపిస్తాయి.. అవి పుట్టుకు రావడం వెనుక కారణాలు కూడా అంతే వింత గా ఉంటాయి.


End of Article

You may also like