Ads
ఏ చిన్న మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా.. మనం చేసే మొట్ట మొదటి పని 108 కి కాల్ చేయడం. ఎక్కడో రోడ్డు పై ఎవరికో ఆక్సిడెంట్ అయితే.. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా 108 కు ఫోన్ చేయగానే అంబులెన్స్ వచ్చి దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకెళ్లి.. వారి ప్రాణాలను కాపాడుతుంది. ఈ అంబులెన్స్ వలన చాలా మంది ప్రాణాలు సేవ్ అవుతున్నాయి. అయితే.. అసలు అంబులెన్స్ కి 108 అనే నెంబర్ నే పెట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
మన దేశం లో హిందువులు ఎక్కువ గా ఉన్నారు. మన దేశం లో హిందువులందరికీ 108 ఎంతో పవిత్రమైనది. మనం మొక్కు కోసం ప్రదక్షిణాలు చేసేటపుడు 108 ఉండేలా చూసుకుంటాం. దేవుడికి కట్టే మాలలో కూడా 108 పువ్వులు ఉండేలా చూసుకుంటాం.. అంతెందుకు.. ధ్యానం చేయడానికి ఉపయోగించే దండకి కూడా 108 పూసలు ఉంటాయి.. హిందువులకు 108 ఎంతో పవిత్రమైన నెంబర్.
హిందువులకే కాదు.. ముస్లిం, ఇస్లాం మతస్థులకు కూడా 108 ఎంతో పవిత్రమైనది. మరణించిన తరువాత ఆత్మా 108 ఘట్టాలు దాటి పైకి చేరుకుకుంటుందని ముస్లిం లు విశ్వసిస్తారు. ఇస్లాం మతస్థులు కూడా 108 నెంబర్ ను దైవం గా భావిస్తారు. ఇదంతా పక్కన ఉంచితే.. 108 నెంబర్ లో 0 ఆడవారిని, 1 మగవారిని సూచిస్తుంది. 8 అనే సంఖ్య ఎటర్నిటీ ని సూచిస్తుంది. ఈ కారణాల వలనే 108 ని ఉపయోగిస్తున్నారు.
ఇవి పక్కన పెడితే.. సైకాలజీ పరం గా కూడా 108 కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనిషి బాగా డిప్రెషన్ గురి అయినా సమయం లో ఫోన్ లో ఎడమ వైపుకు చివరి వైపుకు చూస్తూ ఉంటారట.. ఆ భాగం లో 0 , 8 ఉంటాయి. అందుకే.. 108 నెంబర్ ను ఎంచుకున్నారని చెబుతూ ఉంటారు. అలాగే.. సూర్యుడు, భూమి, చంద్రుడు మధ్య దూర వ్యాసం కూడా 108 రెట్లు ఉంటుందంటారు.. శాస్త్రం ప్రకారం కూడా.. 108 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాగే.. ఉపనిషత్తులు, మర్మ స్థానాల సంఖ్య కూడా 108. అందుకే ఈ సంఖ్యను ఎంచుకున్నారు.
End of Article