గడ్డు కాలాన్ని మంచి రోజులుగా మార్చగలిగే దేవత గురించి విన్నారా..? రాత్రి మాత్రమే తెరచి ఉండే ఈ గుడి ఎక్కడ ఉందంటే..?

గడ్డు కాలాన్ని మంచి రోజులుగా మార్చగలిగే దేవత గురించి విన్నారా..? రాత్రి మాత్రమే తెరచి ఉండే ఈ గుడి ఎక్కడ ఉందంటే..?

by Anudeep

మనిషికి అన్ని సుఖాలు ఉన్నపుడు తనంత గొప్పవాడు ఎవరు లేరు అంటూ ఫీల్ అవుతుంటాడు. అదే చిన్న కష్టం వచ్చినా.. వెంటనే భగవంతుడా ఏంటి శిక్ష..? అంటూ ప్రశ్నిస్తుంటారు. కష్టం వచ్చినపుడు బెదరకుండా ఉండడం, సుఖం వచ్చినపుడు ఆ సుఖానికి కారణమైన వారిని గుర్తెరగడం చాలా తక్కువ మందికి సాధ్యం అవుతాయి. ఎందుకంటే మానవులు నిమిత్తమాత్రులు. వారిలో కలిగే భావాలను అదుపు చేయడం అంత సులువు గా సాధ్యం కాదు.

Video Advertisement

kala devi temple 2

అయితే.. మనలో చాలా మందికి ఎప్పుడు ఎదో ఒక కష్టం ఎదురవుతూనే ఉంటుంది. రెండు రోజులు హ్యాపీ గా ఉన్నాం అంటే.. మూడో రోజు దేనికి బాధపడాల్సి వస్తూందో అని ఆలోచించుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి మనందరి కోసం తమిళనాడు లో ఓ దేవాలయం ఉంది. ఈ దేవాలయం మనుషులు అనుభవిస్తున్న గడ్డు కాలాన్ని మంచి కాలం గా మార్చేయగలదు. ప్రపంచం లో ఏ దేవుడి గుడి అయినా పగలంతా తెరచి రాత్రి మూసేస్తారు.

kala devi temple 1

కానీ తమిళనాడు లోని మధురై లో కల్లుపట్టి పక్కన ఉండే గోపాలపురం లోని శిల్పారెట్టి గ్రామం లో కాలాదేవి ఆలయం మాత్రం పగలంతా మూసి ఉంటుంది. రాత్రి సమయం లో మాత్రమే తెరచి ఉంటుంది. సూర్యాస్తమయం తరువాత.. తిరిగి సూర్యోదయం లోపు ఈ దేవాలయం లో పూజలు నిర్వహిస్తారు. ఇక్కడ కొలువైన కాలా దేవి అమ్మవారు తనను నమ్మి వచ్చిన భక్తుల గడ్డు కాలాన్ని తొలగించి మంచి రోజులు వచ్చేలా దీవిస్తుంది. ఆ దేవత ముందు కనీసం పదకొండు సెకండ్ల పాటు ఉండి ప్రార్ధిస్తే జీవితం లో చెడు కాలం తొలగిపోతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతే కాదు.. అమావాస్య, పౌర్ణమి రోజులలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


You may also like

Leave a Comment