Ads
టీ పెట్టుకుని తాగడానికి మీకెంత టైం పడుతుంది పది నిమిషాలు , మరీ ఎక్కువంటే పావుగంట . కానీ సియాచిన్లో ఎంత టైమ్ పడుతుందో ఊహించగలరా మూడు గంటలు . అంతసేపు కష్టపడి పెట్టుకున్న టీని మూడు సెకన్లలో తాగేయాలి , లేదంటే గడ్డకట్టిపోతుంది . కేవలం టీ తాగడానికే అంత కష్టపడే పరిస్థితి అంటే అక్కడ ఎంతటి విపత్కర పరిస్థితుల్లో బతుకుతుంటారో ఆలోచించండి . మన దేశంలో సైనికులు , రైతులు పడుతున్న కష్టం , వారికి మనమిచ్చే గౌరవం ఏంటో తెలుసా ?
Video Advertisement
“సియాచిన్” ఈ పదం ఈ మధ్య తరచూ వార్తల్లో వినే ఉంటారు . సియాచెన్ హిమానీ నదం ప్రపంచంలోకెల్లా ఎత్తైన యుద్ధ క్షేత్రం. భారత్ పాకిస్తాన్లు అడపాదడపా అనేక సార్లు ఘర్షణ పడిన ప్రాంతం . రెండు దేశాలూ శాశ్వత సైనిక స్థావరాలను స్థాపించాయి. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా ? అక్కడ సైనికుల ఆరోగ్యం , ఆహారం పరిస్థితి ఏంటో తెలుసా? యుద్దంలో కాదు , అక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించక, సరైన వసతులు లేక 2000 మందికి పైగా చనిపోయారు .
దేశానికి రైతే వెన్నెముక అని చిన్నప్పటి నుండి చదువుకుంటున్నాము . మనకి ఆహారం కావాలంటే రైతులు పంటలు పండించాలి . కానీ సేద్యం ఎప్పుడూ సంక్షోబాల వలయమే . ప్రకృతి విపత్తులనుండి మద్దతు వరకు ప్రతిది రైతన్నకి పరీక్ష , ఆ పరీక్షలు నెగ్గలేక ఆత్మహత్యల పాలవుతున్నాడు. అటువంటి వార్తలు చూడగానే అయ్యో అంటాం. రెండు కన్నీటి చుక్కలు కారుస్తాం. రైతు గొప్పతనం గురించి మాట్లాడతాం. వాళ్లకి మనమిచ్చే గౌరవం అదేనా?
రైతే రాజు , జై జవాన్ – జై కిసాన్ .. రైతుల్ని , సైనికుల్ని మాటల్లో పొగడడం తప్ప నిజజీవితంలో వాళ్లకి ఇచ్చే గౌరవం ఎంత ? ఒకసారి ఆలోచించండి. నిజం చెప్పండి , మీ ఇంట్లో కొడుకులు రైతు అవుతానంటే ఒప్పుకుంటారా? బార్డర్ కి వెళ్లి యుద్దం చేస్తామంటే సరే అంటారా? ఒక రైతుకి మీ కూతురినిచ్చి పెళ్లి చేస్తారా ? వీటన్నింటికి క్షణం పాటు ఆలోచించే వాళ్లు కూడా అర సెకన్ ఆలోచించకుండా కొటేషన్స్ శేర్ చేసేస్తుంటారు . రైతుని , సైనికున్ని పొగుడుతూ గొప్పలు చెప్తుంటారు . కానీ వాస్తవాలు వేరు .
End of Article