Ads
మనకు భయం వేసినప్పుడు వెంటనే ఎవరిని తలుచుకుంటాం..? ఈ ప్రశ్నను చిన్న పిల్లాడిని అడిగినా ఆంజనేయుడు అంటూ టపీమని సమాధానం ఇస్తాడు. అలాగే.. ఆంజనేయుడు ఆరోగ్య ప్రదాత కూడా.. చాలా హనుమాన్ దేవాలయాల్లో చిన్నపిల్లలకు అంజనం కట్టిస్తూ ఉంటారు. ఏదైనా అనారోగ్యం బారిన పడినవారు తొందరగా కోలుకుంటారని నమ్ముతారు.
Video Advertisement
ఆంజనేయుడు గుడి లేని ఊరు ఈ భారత్ దేశం లో ఏదీ ఉండదు. చాల దేవాలయాల్లో కూడా ఓ చోట హనుమంతుని కి చిన్న ఉపాలయాన్ని కూడా నిర్మిస్తూ ఉంటారు. ఏ గుడి లో అయినా హనుమంతుడు కండలు తిరిగిన దేహం తో కనిపిస్తూ అభయం ఇస్తూ ఉంటాడు. అయితే.. ప్రపంచం లో ఒకే ఒక్క చోట మాత్రం హనుమంతుడు స్త్రీ రూపం లో దర్శనం ఇస్తూ ఉంటాడు. అదెక్కడో కాదు.. మన భారత్ లోనే.. ఛత్తీస్ ఘర్, రతన్ పూర్ జిల్లాలో గిర్జ బంద్ వద్ద హనుమాన్ దేవాలయం లో హనుమంతుడు స్త్రీ రూపం లో దర్శనమిస్తాడు.
దీని వెనక ఓ స్థల పురాణం కూడా ఉంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు దేవ రాజ్ అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు తీవ్రమైన అనారోగ్యం ఉండేదట. అయితే.. అనారోగ్యం నుంచి బయటపడలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.. ఆ రోజు రాత్రి రాజుకు కలలో ఆంజనేయ స్వామి కనిపించి తనకు గుడి కట్టించాలని కోరతాడు. దీనితో.. ఆ రాజు ఆత్మహత్య అన్న ఆలోచన మానుకుని గుడి కట్టించడానికి ఏర్పాట్లు చేస్తాడు. నిర్మాణం పూర్తి కావొస్తున్న తరుణం లో రతనపూర్ రాజు పృథ్వి దేవ్ రాజ్ కు హనుమంతుడు మరోసారి కనిపించి మహామాయ కుండ్ వద్ద ఉన్న విగ్రహాన్ని తీసుకు వచ్చి ప్రతిష్టించాలని కోరతాడు.
రాజు అలానే అక్కడకు వెళ్లి చూడగా.. అక్కడ దేవతా రూపం లో ఉన్న హనుమంతుడి విగ్రహం కనబడుతుంది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్టాపన చేస్తారు. అప్పటినుంచి హనుమంతుడు ఈ ఆలయం లో దేవతా రూపం లో పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ దర్శనం చేసుకుని స్వామీ ని ఏ కోరిక కోరుకున్నా కచ్చితం ఆ కోరిక నెరవేరుతుందని చెబుతుంటారు. రాయపూర్ స్వామి వివేకానంద ఎయిర్ పోర్ట్ నుంచి 140 కిలోమీటర్ల దూరం లో బిలాస్ పూర్ ఉంది. అక్కడ నుంచి క్యాబ్ లేదా బస్ ద్వారా 28 కిలోమీటర్ల దూరం లో ఉన్న రతన్ పూర్ కు చేరుకోవచ్చు. రాయపూర్ ఎయిర్ పోర్ట్ నుంచి కనీసం 5 గంటల సమయం పడుతుంది.
End of Article