రజినీకాంత్ నటించిన ‘నరసింహ’ సినిమాకి ముందుగా బాలయ్యని హీరోగా అనుకున్నారా.?

రజినీకాంత్ నటించిన ‘నరసింహ’ సినిమాకి ముందుగా బాలయ్యని హీరోగా అనుకున్నారా.?

by Mounika Singaluri

Ads

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘నరసింహ’ చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కథని రచయిత చిన్నికృష్ణ అందించారు. ఈ చిత్రం అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ పెద్ద హిట్ ను సాధించింది.

Video Advertisement

ఈ చిత్రంలో రజినీకాంత్ ని ఢీకొట్టే నీలాంబరి క్యారెక్టర్ లో హీరోయిన్ రమ్యకృష్ణ నటించింది. ఇక చిత్రంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి పక్కన హీరోయిన్ గా సౌందర్య నటించింది. రజినీకాంత్ ముసలితనంలో ఉండే క్యారెక్టర్ లో నటించి ఆడియెన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసాడు. ఇక నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ జీవించింది. రమ్యకృష్ణ రజిని కాంత్ మధ్య వచ్చే సన్నివేశాలలో ఇద్దరు పోటీ పడి మరి నటించారు. ఇలా సినిమాలోని ప్రతి ఒక్కటి ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి.

ఇది ఇలా ఉండగా ఈ స్టోరీలో మొదటగా అనుకున్నది రజినీకాంత్ ని కాదంట. రచయిత ఈ సినిమా కథను తసిన తరువాత ఈ మూవీలో హీరోగా నందమూరి బాలకృష్ణ నటిస్తే బాగుంటుంది అనుకున్నారట. చిన్నికృష్ణ అలా అనుకున్న తరువాత దర్శకుడు బి గోపాల్ కి ఈ స్టోరీని చెప్పాడట. అయితే ఆ సమయంలో బి గోపాల్ బాలయ్యతో సమర సింహా రెడ్డి చిత్రాన్ని చేస్తున్నారు.

దాంతో ఈ స్టోరీని అలాగే ఉంచండి. తరువాత చేద్దామని హోల్డ్ లో పెట్టారంట. అప్పుడు డైరెక్టర్ బి గోపాల్ నిర్ణయానికి చిన్నికృష్ణ సరే అని కొద్దిరోజులపాటు ఈ స్టోరీని పక్కకి పెట్టారట. అయితే బి గోపాల్ కి చెప్పక ముందే ఈ స్టోరీ విన్న చిన్నికృష్ణ స్నేహితుడు ఈ స్టోరీని డైరెక్టర్ కే ఎస్ రవికుమార్ వద్దకి తీసుకెళ్లారంట.

ఈ కథని విన్న రవి కుమార్, స్టోరీ కావాలని చెప్పి,తీసుకుని తన స్నేహితుడైన అయిన సూపర్ స్టార్ రజినీ కాంత్ ని హీరోగా పెట్టి, ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని రజినీకాంత్ తన నటనతో సూపర్ హిట్ చేశాడు. కానీ ఈ సినిమా బాలయ్య నటించి ఉంటే, రమ్యకృష్ణ చేసిన నీలాంబరి పొగరు బోతు పాత్రకి నందమూరి బాలాకృష్ణ చెప్పే డైలాగ్స్ కి కరెక్ట్ గా సెట్ అయ్యేదని ఈ సంగతి తెలిసినవారు అంటూంటారు. మొత్తానికి బాలకృష్ణ మంచి క్యారెక్టర్ మిస్ చేసుకున్నాడని చెప్పవచ్చు.


End of Article

You may also like