వర్షాకాలం లో మీ ఇల్లు తడి వాసన లేకుండా సువాసన రావాలంటే… ఈ చిన్న ట్రిక్స్ ట్రై చేసి చూడండి..!

వర్షాకాలం లో మీ ఇల్లు తడి వాసన లేకుండా సువాసన రావాలంటే… ఈ చిన్న ట్రిక్స్ ట్రై చేసి చూడండి..!

by Anudeep

Ads

Article sourced from: siri’s medi kitchen

Video Advertisement

వానాకాలం వస్తే చిరు జల్లులు కురిసి ప్రాణం కుదుటపడిందని అందరం అనుకుంటాం. అంత వరకు బాగానే ఉంటుంది. కానీ.. వరుస పెట్టి కుండపోత వర్షాలు కురుస్తుంటేనే అసలు చిక్కులు మొదలవుతాయి. బయట వాన చినుకులు పడకుండా బాల్కనీ ఉండేవారి సంగతి మినహాయిస్తే మిగిలిన వారిలో చాలా మంది ఇళ్లల్లో బట్టలు ఆరవు.

ఎండగా ఉన్నరోజున గంటలో ఆరిపోయే బట్టలు ఇంట్లోనే ఆరేసుకోవాల్సి రావడం వలన రెండు మూడు రోజులైనా ఆరవు. దానివలన ఇల్లంతా అదోలాంటి వాసనా వస్తూ ఉంటుంది. ఇక.. గాలి తగలక ఇంట్లో గోడలు, కిచెన్ గట్లు వంటివి తేమ పట్టి ఇల్లంతా వాసన వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే ట్రిక్స్ తో ఈ వాసనకు చెక్ పెట్టండి.

ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను వేయండి. బేకింగ్ సోడా సాధారణం గానే దుర్వాసనను పోగొడుతూ ఉంటుంది. ఈ బేకింగ్ సోడాకు ఒక స్పూన్ ఫాబ్రిక్ ఫ్రెష్నర్ (కంఫర్ట్ లేదా మరేదైనా) ను ఆడ్ చేయండి. పైన ఒక నెట్ క్లాత్ ను కప్పేసి రబ్బర్ బ్యాండ్ వేసేస్తే సరి. ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అదే పొడి లో ఒక స్పూన్ కంఫర్ట్ ను కలిపితే సరిపోతుంది.

అలాగే.. బేకింగ్ సోడా ను ప్రతి సారీ మార్చక్కర్లేదు. నాలుగు నెలలకు ఒకసారి మారిస్తే సరిపోతుంది. ఇంట్లో ఓ పక్కగా పెడితే.. ఇల్లంతా మంచి వాసన వస్తుంది. ఇంకో ట్రిక్ ఏంటంటే.. ఒక కప్ లో వాటర్ తీసుకుని అందులో ఒక స్పూన్ బేకింగ్ సోడా ఆడ్ చేయండి. దానికి హాఫ్ లెమన్ ను ఆడ్ చేసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో వేసుకుని విండోస్ కర్టైన్స్ , మాట్స్ వంటి చోట్ల.. ఇంట్లో అక్కడక్కడా స్ప్రే చేస్తే చాలు..

ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా ను తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ వెనిల్లా ఎస్సెన్స్ ను ఆడ్ చేసి మిక్స్ చేయాలి. దానిపైన ఓ నెట్ క్లాత్ పెట్టుకుని రబ్బర్ బ్యాండ్ తో క్లోజ్ చేయాలి. దీనిని ఇంట్లో ఓ మూల ఉంచినా ఇంట్లోని దుర్వాసనను పోగొడుతుంది. ఇంకా ఒక గ్లాస్ వాటర్ ను బాయిల్ చేసి.. అందులోనే కట్ చేసిన లెమన్ స్లైసెస్ ను, వెనిల్లా ఎస్సెన్స్ ను ఆడ్ చేసి పదినిమిషాలు లో ఫ్లేమ్ లో మరిగించాలి. కావాలనుకుంటే దాల్చిన చెక్క, లవంగాలు, గులాబీ రెక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ నీటిని వడపోసి, చల్లార్చి స్ప్రే బాటిల్ లో పోసుకుని ఇల్లంతా స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది.

వీటన్నిటికంటే తేలిక అయిన చిట్కా ఏమిటంటే.. ఒక బాటిల్ రోజ్ వాటర్ ను తీసుకుని అందులో ఒక స్పూన్ గంధం పొడి ను కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్ లోకి తీసుకుని ఇంట్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడ స్ప్రే చేసుకోవచ్చు. ఇల్లంతా సువాసన వెదజల్లుతూ ఉంటుంది.

Watch Video:


End of Article

You may also like