తరచుగా పాలు పొంగిపోతున్నాయా..? అయితే ఈ చిన్న ట్రిక్ ని పాటించి చూడండి..!

తరచుగా పాలు పొంగిపోతున్నాయా..? అయితే ఈ చిన్న ట్రిక్ ని పాటించి చూడండి..!

by Megha Varna

Ads

కొన్ని కొన్ని సార్లు మనం పని హడావిడిలో పడిపోయి స్టవ్ మీద పెట్టిన పాలని మర్చిపోతూ ఉంటారు. దీంతో స్టవ్ మీద పెట్టిన పాలు అనవసరంగా వృధా అయిపోతాయి. స్టవ్ మీద పెట్టిన పాలు కనుక పొంగిపోతే ప్రాణం ఉసూరుమంటుంది. పైగా తిరిగి పొంగి పోయిన పాలు కూడ పనికి రావు.

Video Advertisement

ఇలా పాలు పొంగి పోకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఏం చేయాలి అని అనుకునే వాళ్లందరికీ కూడా ఈ చిన్న చిట్కా. ఈ చిట్కాని కనుక ఫాలో అయితే కచ్చితంగా పాలు వృధా కాకుండా ఉంటాయి. ఎక్కడికి అవి పోకుండా గిన్నెలోనే ఉంటాయి.

అయితే దాని కోసం ఏం చేయాలంటే.. మనం పాలు కాచేటప్పుడు ఒక చెక్క గరిటని కానీ స్పూన్ ని కానీ తీసుకుని గిన్నె లోపల నిటారుగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పాలు ఎప్పటికీ పొంగిపోవు. దానితో పాలు కిందకి పడిపోవు. పైగా కాగేటప్పుడు మనం ఏదైనా పనిలో ఉండిపోయినా అవి గిన్నె లోనే ఉండి పోతాయి.

కింద మంట పెట్టిన వేడికి గిన్నె లోపల ఒక చెక్క స్పూన్ ఉంటే అప్పుడు అసలు పాలు బయటికి రావు. అయితే దీనికి గల కారణం ఏమిటంటే పాలు కాగే సమయంలో కింద మంట పెట్టడం వల్ల ఒక పొర మాదిరి పాలు ఆవిరిగా పైకి వస్తుంది. అది గరిటకి తగలగానే తొందరగా ఉష్ణాన్ని లాగేసుకుంటుంది. దీంతో త్వరగా పాలు పొంగి పోకుండా అక్కడితో ఆగిపోతాయి. ఇలా ఈ చిన్న చిట్కాతో మీరు పాలని వృధాగా పోకుండా చూసుకోవచ్చు.


End of Article

You may also like