జైళ్లలో ఎలాంటి ఆహారం అందిస్తారు..? భోజనానికి ఏ పదార్ధాలు పెడతారు అంటే..?

జైళ్లలో ఎలాంటి ఆహారం అందిస్తారు..? భోజనానికి ఏ పదార్ధాలు పెడతారు అంటే..?

by kavitha

Ads

హీరో లేదా విలన్ జైలుకు వెళ్ళడం వంటి సన్నివేశాలను చాలా సినిమాలలో చూపించడం జరిగింది. ఈ క్రమంలో జైలు లోపల ఎలా ఉంటుందో, వారిని కలవడానికి వచ్చేవారిని, ఖైదీలు ఉండే జైలు గదులు కూడా పలు సినిమాలలో కనిపిస్తాయి.

Video Advertisement

ఖైదీల జీవన విధానం, వారు చేసి పనులను మరియు వారు భోజనం కోసం వరుసలో నిలబడి ఉండడం వంటి సన్నివేశాలను కూడా కొన్ని చిత్రాలలో అందరూ చూసే ఉంటారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జైళ్ళలో ఉండే ఖైదీలకు ఎలాంటి ఆహారం ఇస్తారో ఇప్పుడు చూద్దాం..
భారతీయ జైళ్ళలో ఎలాంటి ఆహారం ఇస్తారనే విషయాన్ని కోరాలో అడగగా, ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ జైలులో ఎలాంటి ఆహారం పెడతారనే విషయం గురించి వివరించారు. అదే విధంగా ఒక వ్యక్తి తెలంగాణలో చంచల్ గూడ జైలులో ఎలాంటి ఆహారం పెడతారో గురించి ఈ విధంగా చెప్పుకొచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్ జైలులో “అల్పాహారంగా ప్రతి రోజు, ఉదయం 6:30 గంటలకు పులిహోరను వడ్డిస్తారు. మధ్యాహ్న భోజనంలో అన్నం, కూరగాయలు లేని నీళ్ల సాంబారు. రోజూ ఒక్కో రకం కూర. దాదాపు 11:30 కి పెట్టారు. రాత్రి భోజనంలో రసంతో తాజాగా వండిన అన్నం, మధ్యాహ్న భోజనంలో మిగిలిన సాంబార్. దీర్ఘకాలం ఉండే ఖైదీలకు దాదాపు సాయంత్రం 5:00 గంటలకు ఒక గుడ్డు. ఆదివారం నాడు  200 గ్రాముల మటన్ లేదా కోడి కూర. కూర తూకం వేయబడుతుంది. తద్వారా ప్రతి ఒక్కరికి సమానంగా లభిస్తుంది. ఎటువంటి గొడవలు జరగవు, కూర చాలా బాగుంది. పోలీసులు మాతో కలిసి భోజనం చేస్తారు. శాఖాహారులకు ఆదివారం ప్రత్యేక కూర ఇస్తారని ఒకరు వివరించారు.
తెలంగాణ చంచల్‌గూడ జైలు లో “అల్పాహారం ప్రతిరోజూ ఉదయం 7:00 గంటలకు  చపాతీ, ఉప్మా మొదలైనవి చాలా పరిమిత పరిమాణంలో అందించబడతాయి. టీ కూడా ఇస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు భోజనంలో అన్నం మరియు కూర సమృద్ధిగా లభిస్తాయి. జైలు క్యాంటీన్ లో ఊరగాయలు కొని, అన్నం తినడానికి, మధ్యాహ్న భోజనంతో కొన్ని స్నాక్స్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు మళ్లీ కూరతో అన్నం సరిపడినంత  లభిస్తుందని” ఒక యూజర్ వివరించారు.

Also Read: నాడు బ్రిటిషర్లకే డబ్బులు అప్పు ఇచ్చిన భారతీయుడి కుటుంబం..! ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది..?

 

 

 


End of Article

You may also like