ఇలా చేస్తే ఫ్రీ పెట్రోల్ ఇస్తారు..! వీరి ఆలోచన చూస్తే హాట్సాఫ్ అనాల్సిందే..!

ఇలా చేస్తే ఫ్రీ పెట్రోల్ ఇస్తారు..! వీరి ఆలోచన చూస్తే హాట్సాఫ్ అనాల్సిందే..!

by kavitha

Ads

చెత్తతో ఫ్రీ పెట్రోల్, ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. అది కూడా ఎక్కడో కాదు. హైదరాబాద్ లోనే. అయితే  దానికోసం పేపర్లు, ప్లాస్టిక్​,ల్యాప్​టాప్​ ల వంటి చెత్తను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం లీటరు పెట్రోల్​ ధర వందకు పైగా ఉంది. అందువల్ల పెట్రోల్​ ఫ్రీగా అంటే ఎవరు తీసుకోకుండా ఉంటారు.

Video Advertisement

మరేందుకు లేట్ చెత్తను ఇచ్చి, పెట్రోల్​ను తీసుకువెళ్ళండి అంటోంది ఒక స్టార్ట్ అప్ సంస్థ. మరి ఆ సంస్థ ఏమిటో? చెత్తను ఎక్కడ ఇవ్వాలో? ఎంత చెత్తను ఇస్తే లీటర్ పెట్రోల్ ఇస్తారో? అలా చెత్తను తీసుకుని పెట్రోల్ ఇచ్చే కేంద్రాలు ఎక్కడ ఉన్నయో ఇప్పుడు చూద్దాం..
మారుతున్న టెక్నాలజీతో ప్రపంచం కొత్త మార్గాలలో వెళ్తోంది. నిత్యం ఎన్నో ఆవిష్కరణలు వస్తూనే ఉన్నాయి. ఇక సాంకేతికతను వాడుకుంటూ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇండియన్​ ఆయిల్​ కార్పొరేషన్ సరికొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. దీనికి హైదరాబాద్​కు చెందిన స్టార్ట్ అప్ కంపెనీ రిసైకల్​ సహకారాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.
ఇవి ఏం చేస్తాయంటే కస్టమర్ నుండి చెత్తను తీసుకుని, దానికి బదులుగా పెట్రోల్​ను ఇస్తారు. హైదరాబాద్ లోనే ఫైలన్​ ప్రాజెక్టుగా ప్రారంభించారు. జూన్ 5, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇండియన్ ఆయిల్ సంస్థ చైర్మన్, ఎస్ఎం వైద్య, హైదరాబాద్‌లో ప్రారంభించారు. శ్రీ మీడియా మనీ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో చెత్తతో ఫ్రీ పెట్రోల్ అనే విషయం గురించి తెలిపారు. అందులో “మీ దగ్గర ఉన్న పేపర్లు, ప్లాస్టిక్​, మొబైల్స్, వైఫై మోడెమ్స్ కానీ, ల్యాప్​టాప్, డ్రై వెస్ట్ లేదా వేట వెస్ట్ కానీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ లో ఉండే రిసైకల్​ సంస్థ వారికి ఇస్తే మీ ముందే బరువు చూసి, పెట్రోల్ ఇస్తారు. 5 కేజీల చెత్తను ఇస్తే 680 పాయింట్స్ ఇస్తారు. ప్రతి పాయింట్ కి 1 ఎంఎల్. ఒకవేళ 10 కిలోల చెత్తను ఇస్తే, ఒక లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇలా ఇచ్చే ప్లేస్ ఎక్కడంటే, హైటెక్ సిటీ, ఐకియా, బేగం పేట్, మియాపూర్ లో ఉన్నాయి” అని చెప్పుకొచ్చారు.

https://www.instagram.com/reel/CvKQmzrtwoX/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: ఒక్క ఫొటోతో ఫేమస్ అయిన పాకిస్థానీ “ఛాయ్ వాలా”… ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?


End of Article

You may also like