రాత్రి పడుకునే ముందు ఇలా చేశారంటే డార్క్ సర్కిల్స్ పోవడం ఖాయం..!

రాత్రి పడుకునే ముందు ఇలా చేశారంటే డార్క్ సర్కిల్స్ పోవడం ఖాయం..!

by Anudeep

Ads

ఇటీవలి కాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య డార్క్ సర్కిల్స్. కంటినిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి పెరుగుతుండడం, సరైన సమయంలో తిండి తినకపోవడం వలన అనేక ఇబ్బందులు వస్తాయి. ఆహారపు అలవాట్లు, హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉండడం వలన కూడా కంటి కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి.

Video Advertisement

అయితే ఈ డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. చాలా మంది ఎన్ని ప్రయత్నాలు చేసిన ఈ డార్క్ సర్కిల్స్ పోవడం లేదని పట్టించుకోవడం మానేస్తు ఉంటారు.

eyes 1

ఇలా నెగ్లెక్ట్ చేయడం కూడా సరికాదు. డార్క్ సర్కిల్స్ పోవాలంటే మీ ఇంట్లోనే ఈ నాచురల్ క్రీంను తయారు చేసుకోండి. ఈ క్రీం ను రాసుకుంటే మీ కళ్ళ కింద ఉండే డార్క్ సర్కిల్స్ అన్ని పోతాయి. అంతే కాదు పదే పదే డార్క్ సర్కిల్స్ రాకుండా ఉంటాయి. ముందు రెండు ఆరంజ్ పండ్లను తీసుకోండి. వాటి నుంచి జ్యూస్ ను సెపరేట్ చేయండి.

eyes 2

మరో బౌల్ తీసుకుని అందులో ఆరంజ్ జ్యూస్, ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్, ఒక టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ ను వేసుకోవాలి. ఆ తరువాత దీనిని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి. ఆ మిశ్రమం దగ్గరకి వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తరువాత ఈ మిశ్రమం చల్లబడిన తరువాత అందులో ఒక స్పూన్ అలో వెరా జెల్, ఒక స్పూన్ ఫ్లెక్సీ సీడ్ జెల్, రెండు స్పూన్ల ట్రీ ట్రీ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తరువాత కళ్ళ కింద అప్లై చేయాలి. ఉదయాన్నే కూల్ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. ప్రతి రోజు ఇలా చేస్తూ ఉంటె క్రమంగా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.


End of Article

You may also like