Ads
ఆత్మలు, దయ్యాల గురించి మనందరం తరచుగా వింటూ ఉంటాం. కొంత మంది వీటిని నమ్మితే, కొంత మంది మాత్రం వీటిని ఎక్కువగా నమ్మరు. అయితే మనం యూట్యూబ్ లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఆత్మలు వచ్చాయి అనే వార్తలు, అలాగే ఆ వార్తకు సంబంధించిన వీడియోలను చూస్తూనే ఉంటాం. కానీ ఇది నిజమా? లేదా? అనేది ఎవరికి తెలియదు. అయితే ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అది కూడా జనాలు ఉన్న చోట. అది కూడా ఒక క్రికెట్ మ్యాచ్ లో.
Video Advertisement
వివరాల్లోకి వెళితే జింబాబ్వే, బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండవ టి-20 లో ఈ సంఘటన రికార్డ్ చేయబడింది. బ్యాట్స్మన్ స్టంప్స్ దగ్గర లేరు. అయినా సరే వికెట్ పడింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ యొక్క 18వ ఓవర్లో మహమ్మద్ సైఫుద్దీన్ స్ట్రైక్ లో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది. బౌలింగ్ చేస్తున్న టెండాయ్ చతారా ఫుల్ షాట్ ఆడుతున్నప్పుడు సైఫుద్దీన్ స్టంప్స్ ని తగిలేలా కొట్టారు అని అందరూ అనుకున్నారు. కానీ బెయిల్స్ పడిపోతున్న శబ్దం రావడంతో సైఫుద్దీన్ వెనక్కి తిరిగి చూశారు.
జరిగిన సంఘటన అంతా కొంచెం గందరగోళంగా ఉండటంతో, అంపైర్లు వెళ్లి ఫూటేజ్ పరిశీలించి చూశారు. వీడియో ఫూటేజ్ చూసిన అంపైర్లకు కూడా ఆ సంఘటన చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. జరిగిన సంఘటన రిప్లై చేసి చూడగా సైఫుద్దీన్ వికెట్ కి కొంచెం దూరంలో ఉన్నారు అని వారికి కనిపించింది. గాలి వల్ల బెయిల్స్ కింద పడ్డాయి. ఇంకొక విషయం ఏంటంటే స్టంప్స్ స్థానం కూడా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
watch video :
First ever wicket taken by a ghost 😛😂 pic.twitter.com/9vG0BI50S4
— Mazher Arshad (@MazherArshad) July 24, 2021
End of Article