Ads
అబ్బాయి పుట్టగానే వంశోద్ధారకుడు పుట్టాడని సంబరపడిపోయే కుటుంబాలు, అదే అమ్మాయి పుట్టిందనే సరికి ఢీలా పడిపోతారు. ఆడపిల్ల పుడితే ఆమెకు పెళ్ళి, పిల్లలు ఇలా చాలా బాధ్యతలు ఉంటాయని, ఓ ఇంటికి పంపే వరకూ చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందనే ధోరణి చాలామంది తల్లిదండ్రుల్లో ఉంది.
Video Advertisement
ఆస్తి పంపకాల విషయంలోనూ, నచ్చిన చదువును చదివించడానికి మగపిల్లాడికి ఉన్న ప్రాధాన్యత ఆడపిల్లకి ఉండదు. ఈ పద్దతి మారాలంటే ఏం చేయాలో చూద్దాం..
#1. ప్రతి పనిలోనూ భాగం చెయ్యాలి:
పనులతోనే స్త్రీ, పురుషులను వేరు చేయడం మొదలవుతుంది కాబట్టి మొదట దాన్ని దూరం చెయ్యాలి. ఇంటిపని, వంటపని, బయట పనుల్లోనూ ఇద్దరు పిల్లల్ని భాగస్వామ్యం చేయాలి. ఇద్దరినీ ప్రతి పనిలోనూ భాగస్వామ్యం చేసే బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది.
#2. కథలు చెప్పండి:
మంచి కథలను పిల్లలకు ఆసక్తి కలిగేలా చెప్పాలి. అందులో ఎంచుకునే కథాంశం కూడా లింగవివక్షత, ధీరవనితల గురించి మగపిల్లలుకు కథలు అల్లి చెప్పడం వల్ల అవి భవిష్యత్ లో వారికి ఆడవారిపట్ల గౌరవంతో మెలిగేలా చేస్తాయి.
# 3. చిన్నపాటి చర్చలు చేయండి:
పిల్లలతో చిన్న చర్చలు చేయాలి. చుట్టూ జరుగుతున్న విషయాల గురించి మాట్లాడాలి. ఇది వారికి ప్రతి విషయాన్ని గమనించే శక్తిని ఇస్తుంది.
#4. పంచుకోవడం నేర్పాలి:
ఏ వస్తువు కొన్నా ఆడపిల్లకు పంచాకే మగవారికి ఇచ్చే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల మగపిల్లాడికి ఆడపిల్ల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఇంట్లో చూపుతున్నారని అర్థం అవుతుంది. ఎక్కువ తక్కువ లేకుండా అన్నిటినీ ఆడపిల్లలు, మగపిల్లలు సమానంగా పంచుకునే అలవాటు అలవడుతుంది.
#5. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి:
ఇంట్లో భార్యాభర్తలు ఎక్కువ తక్కువ అనే విషయాన్ని వదిలెయ్యాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయినా కాకపోయినా ఎవరిపని వాళ్ళు బాధ్యతగా చేస్తుంటారు కాబట్టి ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చుకుంటే పిల్లలకు అదే అలవాటు అవుతుంది.
#6. తప్పుని ఒప్పుకోవాలి:
తప్పు చేసినా, తప్పుగా ప్రవర్తించినా, ఏదైనా సమస్యలో చిక్కుకున్నా దాన్ని బయటకు చెప్పి ఒప్పుకునే మనస్తత్వాన్ని పెంచాలి. దీనివల్ల భవిష్యత్తులో అన్నిటినీ అంగీకరించే మానసిక సామర్థ్యము పెరుగుతుంది. పైన చెప్పుకున్నట్టు పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ పద్దతిని పాటిస్తే సమాజంలో లింగ వివక్షత అనే పెద్ద విషయాన్ని పరిష్కరించి లింగసమానత్వాన్ని సాధించవచ్చు.
End of Article