Ads
చదువులో ప్రతిభ కనపర్చడానికి కుటుంబ పరిస్థితులు అడ్డుకాదని నిరూపించిందో యువతి. ఇంటర్‌లో 95 శాతం మార్కులు సాధించి తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది. చెన్నైలోని పెరంబూర్‌లోని గవర్నమెంట్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదువుతుంది రమ్య. 12వ తరగతి పరీక్షలకు రెండు రోజుల ముందు రమ్య తండ్రి ఎన్ దయాళన్ గుండెపోటుకు గురయ్యారు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న దయాళన్ అనారోగ్యంతో చాలా రోజులు హాస్పిటల్ కే పరిమితం అయ్యారు.
Video Advertisement
దీంతో రమ్య చాలా సమయం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ..ఉన్న కాస్త సమయం లో ఇంట్లోనే చదువుతూ ఉన్నారు. ఆమెను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లేందుకు కూడా ఎవరూ లేరు అని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. ట్యూషన్స్ కి పంపేందుకు తమ ఆర్థిక పరిస్థితి సరిపోకపోవడం తో యూట్యూబ్ లో చూసి ఆమె చదువుకుందని వారు వెల్లడించారు. “తనను చదివించేందుకు మెం ఎంతో కష్ట పడ్డాం..ఇప్పుడు దానికి ఫలితం లభించింది.” అని రమ్య తల్లి విజ్జి తెలిపారు.
“పరీక్షల ముందు చదువుకోకపోతే సంవత్సరం చదివిందంతా వృధా అని నాకు తెలుసు. కానీ ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా నాకు తక్కువ సమయం దొరికింది. నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకొని పరీక్షలు రాసాను. దీంతో 572 /600 స్కోర్ చేశాను.” అని రమ్య దయాళన్ చెప్పారు.
“నా కూతురు ఇంత బాగా స్కోర్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఒక తండ్రికి లభించే గొప్ప బహుమతి ఇదే. నేను నా అనారోగ్యాన్ని మరచిపోయాను . ఆమెను మంచి కళాశాలలో చేర్చడంపై ఇప్పుడు నా దృష్టి ఉంది, ”అని దయాలన్ చెప్పారు. రమ్య ఇప్పుడు బికామ్ చదవాలనుకుంటుంది. తన తండ్రిపై ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి స్కాలర్‌షిప్ అందించే కళాశాలలో చేరాలని ఆమె ఆశిస్తోంది.
End of Article